మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శ
సోమాజిగూడ యశోధ ఆసుపత్రిలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. రేవంత్‌రెడ్డి వెంట మంత్రి సీతక్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా ఉన్నారు.

విధాత : సోమాజిగూడ యశోధ ఆసుపత్రిలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. రేవంత్‌రెడ్డి వెంట మంత్రి సీతక్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా ఉన్నారు. కేసీఆర్‌కు అందుతున్న చికిత్స వివరాలను వైద్యులను, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్‌ను తాను పరామర్శించానని, తొందరగా కోలుకుని తెలంగాణ శాసన సభలో ఆయన మాట్లాడాలని, అనుభవజ్ఞుడిగా ఆయన సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరకుంటున్నామన్నారు. వైద్యులతో మాట్లాడటం జరిగిందని..వారు మంచి వైద్యం అందిస్తున్నారని..కేసీఆర్ కూడా త్వరగా కోలుకుంటున్నారని రేవంత్ చెప్పారు.
అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించారు. తన ఫామ్‌హౌజ్‌లో జారీపడి తుంటి ఎముక(హిట్ రిప్లేస్‌మెంట్ సర్జరీ) ఆపరేషన్ చేయించకున్న కేసీఆర్ యశోధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ రంగాల ముఖ్యులు పరామర్శిస్తున్నారు.