కుక్కతో కోడిపుంజు బాక్సింగ్.. అబ్బుర పరుస్తున్నదిగా!

జంతువులకు కూడా మనుషుల్లాగే ఎమోషన్స్ ఉంటాయి. అవి కూడా కోపాన్ని, జాలిని, ప్రేమను చూపిస్తుంటాయి. ఫ్రెండ్షిప్ కోసం ఇతర జంతువులతో పోట్లాడిన వీడియోలను

కుక్కతో కోడిపుంజు బాక్సింగ్.. అబ్బుర పరుస్తున్నదిగా!

జంతువులకు కూడా మనుషుల్లాగే ఎమోషన్స్ ఉంటాయి. అవి కూడా కోపాన్ని, జాలిని, ప్రేమను చూపిస్తుంటాయి. ఫ్రెండ్షిప్ కోసం ఇతర జంతువులతో పోట్లాడిన వీడియోలను అప్పుడప్పుడు నెట్టింట అనేకం చూస్తుంటాం. అలాగే కోడిపందాలు చూసి ఉంటాం. కుక్కల ఫైటింగ్ చూసి ఉంటాం. కానీ, కుక్కతో కోడిపుంజు ఫైటింగ్ ఎక్కడైనా చూశారా? ఖమ్మం జిల్లా కల్లూరులోని ఎన్ఎస్పీ క్రాస్ రోడ్డు వద్ద ఈ అరుదైన దృశ్యం కనిపించింది. కుక్క ముందు ఫోజులు ఇస్తూ, కుక్క మీదికే కాలు దువ్వుతుంది ఒక కోడిపుంజు. కోడిపుంజు యాక్షన్ ను చూస్తూ సరదాగా ఎంటర్టైన్ చేస్తుంది ఒక కుక్క. కల్లూరు లోని ఒక ఇంటి యజమాని తన ఇంట్లో కోడిపుంజు పెంచుకుంటున్నాడు. ఒక కుక్క పిల్ల వస్తే అన్నం పెట్టి చేరదీశాడు. దానిని సాదుతున్నాడు. కుక్కకు ముద్దుగా రాజు అని పేరు పెట్టాడు. కోడిపుంజు తెల్లగా ఉందని వైటీ అని పేరు పెట్టాడు. ఇవి రెండూ చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర పెరగడంతో మంచి స్నేహితులయ్యాయి. పగలంతా కోడిపుంజును భద్రంగా వేరే జంతువులు దాడి చేయకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది రాజు అనే కుక్క. కోడిపుంజు మాత్రం దర్జాగా రాత్రులు నిద్రపోయి తెల్లవారు జామునే కుక్క వద్దకు వచ్చి లేపుతుంది. ఎప్పుడు కుక్క తోనే తిరుగుతూ, కుక్క మీదకే ఫైటింగ్ కు దిగుతుంది ఆ కోడిపుంజు. ఆ ప్రాంతంలో వైటీ పేరుతో కోడిపుంజు, రాజు పేరుతో కుక్క తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఇవి రెండు పగటిపూట చుట్టుపక్కల ఇండ్లలో సరదాగా తిరుగుతుంటాయిన వాటి యజమాని తెలిపాడు. స్నేహితుల మాదిరిగానే కలిసి తిరుగుతాయి, అదేవిధంగా ఫైటింగ్ కూడా చేసుకుంటాయని వాటిని చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుందని, ఆ యువకుడు తెలిపాడు. వీటి సంబరాన్ని చూసి స్థానికులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.