కోడి పందాల నిర్వహణపై చర్యలు తీసుకోండి
కోడి పందాల నిర్వాహకులపై చర్యలు తీసుకొని,పందాలు జరుగకుండా నివారించాలని పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను కోరింది

- కోడి పందాలు జరుగకుండా నిలువరించండి
- ఏపీ తెలంగాణ ప్రభుత్వాలను కోరిన పెటా
- కోడి పందాలపై కఠినంగా వ్యవహరించాలని పోలీసును ఆదేశించిన ఏపీ డీజీపీ
విధాత: కోడి పందాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకొని, పందాలు జరుగకుండా నివారించాలని పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను కోరింది. ఈ మేరకు పెటా రెండు రాష్ట్రాలకు లేఖలు రాసింది. పెటా లేఖపై తీవ్రంగా స్పంధించిన ఏపీ డీజీపీ కోడిపందాల నిర్వహణ జరుగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కోడి పందాలపై వచ్చిన ఫిర్యాదులకు వెంటనే స్పంధించాలన్నారు. దేశంలో కోడి పందాలపై నిషేధం ఉన్పప్పటికీ పందాలు నిర్వహించడాన్ని పెటా ఆక్షేపించింది. కోడి పందాల నిర్వహణకు మైదానాలు ఏర్పాటు చేస్తున్నారని. పందెం కోళ్లకు స్టెరాయిడ్స్, ఆల్కా హాల్ ఇస్తున్నారని పెటా ఫిర్యాదు చేసింది. కోడి పందాలు జరుగుతున్నట్లు సమాచారం ఉన్న వారు ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేయాలని పెటా కోరుతుందని ఈ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. పందెం కోళ్లను ఎవరైనా స్వాధీనం చేసుకుంటే వాటిని అభయారణ్యంలో సురక్షితంగా వదలడానికి తాము సిద్దంగా ఉన్నామని పెటా తెలిపింది.
కోడి పందాల నిర్వహణ కోసం పెంచిన కోళ్లను ఇరుకైన బోనుల్లో ఉంచి, ప్రాక్టీస్ పేరుతో హిసిస్తారని పెటా పేర్కొన్నది. కొన్ని సార్లు ఈ కోళ్లకు పందేంలో గట్టిగా పోరాడాలని కళ్లకు గంతలు కడుతారని, కాళ్లకు కత్తులు కడతాని, దీంతో వాటి రెక్కలు, కాళ్లు విరిగిపోయే అవకాశం ఉందన్నారు.అలాగే వాటి ఊపిరితిత్తులు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని, ఒక్కోసారి తీవ్ర గాయాలపై వాటి వెన్నుముక కూడా విరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పందాలలో కోళ్లు చనిపోయే ప్రమాదం ఉందని ఆందోళన పెటా ఆందోళన వ్యక్తం చేసింది. కోడి పందాల జూదంను అడ్డుకోవాలని పెట్టా పోలీసులను కోరింది.