కాఫీ తాగే వారు ఎక్కువ కాలం జీవిస్తారట!
విధాత: కాఫీ ప్రియులకు నిజంగా శుభవార్తే.. రోజుకు 2-3 కప్పుల కాఫీ తాగడం వల్ల ఎక్కువ కాలం జీవించవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. అలాగే గుండె జబ్బులకు చెక్ పెట్టవచ్చని అధ్యయానాలు పేర్కొంటున్నాయి. రోజుకు 2, 3 కప్పుల కాఫీ తాగితే గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుందని ఆస్ట్రేలియా సైంటిస్టులు చెప్పారు. అంతేకాదు కాఫీ తాగనోళ్లతో పోలిస్తే ఎక్కువకాలం బతుకుతారని రీసర్చ్‌లో తేలిందట. మెల్బోర్న్లోని బేకర్ హార్ట్ అండ్ డయాబెటిస్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ కు చెందిన […]

విధాత: కాఫీ ప్రియులకు నిజంగా శుభవార్తే.. రోజుకు 2-3 కప్పుల కాఫీ తాగడం వల్ల ఎక్కువ కాలం జీవించవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. అలాగే గుండె జబ్బులకు చెక్ పెట్టవచ్చని అధ్యయానాలు పేర్కొంటున్నాయి. రోజుకు 2, 3 కప్పుల కాఫీ తాగితే గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుందని ఆస్ట్రేలియా సైంటిస్టులు చెప్పారు. అంతేకాదు కాఫీ తాగనోళ్లతో పోలిస్తే ఎక్కువకాలం బతుకుతారని రీసర్చ్‌లో తేలిందట.

మెల్బోర్న్లోని బేకర్ హార్ట్ అండ్ డయాబెటిస్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ కు చెందిన సైంటిస్టులు దాదాపు 30 వేల మంది వలంటీర్లపై సుదీర్ఘంగా రీసెర్చి చేసి మరీ ఈ విషయాన్ని కనుకున్నరు. 40 నుంచి 69 ఏండ్ల వయసున్న వారిని ఎంపిక చేసి కాఫీ తాగడం వల్ల శరీరంలో కలిగే మార్పులను జాగ్రత్తగా గమనించారు.
మిగతావాళ్లతో పోలిస్తే రోజూ రెండు, మూడు కప్పుల కాఫీ తాగేటోళ్లలో గుండె కొట్టుకునే స్పీడ్‌లో పెద్దగా మార్పులు(ఇరెగ్యులర్ హార్ట్‌బీట్) కనిపించలేదని వారు చెప్పారు. అయితే, రోజూ నాలుగైదు కప్పులు లాగించే వాళ్లలో ఈ ప్రయోజనాలు తగ్గుతున్నాయని కూడా చెప్పారు.