Betting Apps: సినిమా వాళ్ల తప్పేం లేదు.. అంతా వారే చేశారు!
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశారంటూ ప్రముఖ టాలీవుడ్ హీరోలు నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి టాలీవుడ్ స్టార్ హీరోల మెడకు చుట్టుకుంది.

Betting Apps: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి టాలీవుడ్ స్టార్ హీరోల మెడకు చుట్టుకుంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశారంటూ ప్రముఖ టాలీవుడ్ హీరోలు నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. స్టార్ హీరోలు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేయడంతో లక్షలాది మంది డబ్బు పోగొట్టుకున్నారని, మ్యూల్ ఖాతాల ద్వారా చైనీయులకు ఈ నగదు చేరిందని రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆహా యాప్ అన్ స్టాపబుల్ లో ఫన్ 88 బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ లు పాల్గొనడాన్ని రామారావు ఆధారాలుగా సమర్పించారు. ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు 11మంది పైన, మియాపూర్ పోలీసులు 25మందిపైన కేసులు నమోదు చేశారు.
ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు కేసులో నిందితులుగా ఉన్న యూ ట్యూబ్ ఇన్ ఫ్లుయర్స్ ను, యాంకర్లను, టీవీ, సినిమా నటులకు నోటీస్ లు జారీ చేసి ఒక్కొక్కరిగా విచారిస్తూ స్టెట్మెంట్ రికార్డు చేస్తున్నారు. అటు ఈడీ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో మనీ లాండరింగ్ అంశాలపై ఫోకస్ పెట్టడంతో రోజురోజుకు ఈ వ్యవహరం చట్టపరంగా మరింత కఠినంగా మారుతుంది.
తప్పంతా వారిది.. బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసినందుకు ఇప్పటిదాక సోషల్ మీడియా ఇన్ ఫ్లుయర్స్ పైన, టీవీ నటులు, యాంకర్లపైన, సినిమా నటులపైన పోలీసులు కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా బెట్టింగ్ యాప్స్ యజమానులపైన కేసులు నమోదు చేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం. 19 మంది బెట్టింగ్ యాప్స్ యజమానులపైన కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. మియాపూర్ పీఎస్ లో 25 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు జరిగింది. అయితే బెట్టింగ్ యాప్స్ కేసులో వాటి యజమానులపై కేసులు నమోదు చేసి.. ప్రమోషన్ లో పాల్గొన్న సెలబ్రిటీలను సాక్షులుగా మార్చాలని నిర్ణయించినట్లుగా సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.