మంత్రి కేటీఆర్‌పై ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ కేడర్‌కు పిలుపునివ్వడం ద్వారా ఎన్నికల నియమాలను ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

  • By: Somu    latest    Nov 29, 2023 12:25 PM IST
మంత్రి కేటీఆర్‌పై ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

విధాత : రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ కేడర్‌కు పిలుపునివ్వడం ద్వారా ఎన్నికల నియమాలను ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. పార్టీ సమన్వయ కమిటీ చైర్మన్ జి. నిరంజన్ ఈ మేరకు తెలంగాణ సీఈవో వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేశారు.


దీక్షా దివస్ సందర్భంగా బీఆరెస్‌ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడాన్ని కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. ఎన్నికల కోడ్‌, మీడియాపై ఆంక్షలు, 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికి దీక్షా దివస్ కార్యక్రమాలు నిర్వహించడం ఓటర్లను ప్రభావితం చేయడమే అవుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే ఎన్నికల సంఘం మంత్రి కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.