Congress MLA | పామును మెడలో వేసుకుని.. బర్త్ వేడుకలు జరుపుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
Congress MLA విధాత: ప్రజాప్రతినిధుల బర్త్ డే వేడుకలు అంటేనే హంగామా ఉంటాయి. పూలదండలు, శాలువాలతో సన్మానించి, కేక్స్ కట్ చేయిస్తుంటారు అభిమానులు. కొంతమంది నాయకులు తమ పుట్టిన రోజు వేడుకలను వినూత్నంగా నిర్వహించుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే తన బర్త్ డే వేడుకలను వినూత్నంగా నిర్వహించుకున్నారు. అభిమానులు తీసుకొచ్చిన పూల దండలను పక్కన పెట్టారు ఎమ్మెల్యే. పామును మెడలో వేసుకుని పుట్టిన రోజు వేడుకలను నిర్వహించి, అందరి దృష్టిని ఆకర్షించారు. వివరాల్లోకి వెళ్తే.. […]

Congress MLA
విధాత: ప్రజాప్రతినిధుల బర్త్ డే వేడుకలు అంటేనే హంగామా ఉంటాయి. పూలదండలు, శాలువాలతో సన్మానించి, కేక్స్ కట్ చేయిస్తుంటారు అభిమానులు. కొంతమంది నాయకులు తమ పుట్టిన రోజు వేడుకలను వినూత్నంగా నిర్వహించుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే తన బర్త్ డే వేడుకలను వినూత్నంగా నిర్వహించుకున్నారు. అభిమానులు తీసుకొచ్చిన పూల దండలను పక్కన పెట్టారు ఎమ్మెల్యే. పామును మెడలో వేసుకుని పుట్టిన రోజు వేడుకలను నిర్వహించి, అందరి దృష్టిని ఆకర్షించారు.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాబు జండేల్.. శుక్రవారం తన పుట్టిన రోజు వేడుకలను నిర్వహించుకున్నారు. ఇక ఎమ్మెల్యే బర్త్ డే సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు ఆయన ఇంటికి భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యేను సన్మానించేందుకు అందరూ పూలదండలు తీసుకొచ్చారు. కానీ ఆ పూలదండలను ఎమ్మెల్యే పక్కన పెట్టారు. ఎవరూ ఊహించని విధంగా తన మెడలో పామును వేసుకుని కేక్ కట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాబు జండేల్ మాట్లాడుతూ.. తన బర్త్ డే వేడుకలను చాలా సాధారణంగా జరుపుకున్నానని తెలిపారు. జంతువులు తన ఫ్రెండ్స్ లాంటివి అని పేర్కొన్నారు. ఇక తన పెరట్లో మల్లెపూల మొక్కలు ఉండటంతో, తరుచూ పాములు వస్తుంటాయని చెప్పారు. శివుడికి ప్రతిరూపం పాము అని చెప్పారు.
కాబట్టి తన బర్త్ డే రోజు పామును తన మెడలో వేసుకుని కేక్ కట్ చేశానని తెలిపారు. ఇది దేవుడిపై తనకున్న నమ్మకం అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పామును ఎమ్మెల్యే మెడలో వేసుకున్నప్పుడు అక్కడ పాములను పట్టే వ్యక్తులు కూడా ఉన్నారు. వారు తీసుకొచ్చిన పామునే ఎమ్మెల్యే మెడలో వేసుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వినూత్న బర్త్ డే వేడుకలు చర్చానీయాంశంగా మారాయి.