Congress విధాత: కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అధ్యక్షుడు, మంత్రి డీకే. శివకుమార్ తో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. బెంగళూరులో డీకేతో వెంకటరెడ్డి భేటీ అయ్యారు. తమ చర్చల్లో తెలంగాణలో పార్టీని అధికారంలో తీసుకురావడానికి డీకే మార్గదర్శకం చేయాలని కోమటిరెడ్డి కోరినట్లు సమాచారం. అలాగే పార్టీలో షర్మిల చేరికపై డీకే తో వెంకటరెడ్డి చర్చించారు. షర్మిల కాంగ్రెస్లో చేరేందుకు కాంగ్రెస్ ఢిల్లీ హై కమాండ్ సుముఖంగా ఉందని అయితే రేవంత్ రెడ్డి సహా టి. […]
Congress
విధాత: కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అధ్యక్షుడు, మంత్రి డీకే. శివకుమార్ తో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. బెంగళూరులో డీకేతో వెంకటరెడ్డి భేటీ అయ్యారు. తమ చర్చల్లో తెలంగాణలో పార్టీని అధికారంలో తీసుకురావడానికి డీకే మార్గదర్శకం చేయాలని కోమటిరెడ్డి కోరినట్లు సమాచారం. అలాగే పార్టీలో షర్మిల చేరికపై డీకే తో వెంకటరెడ్డి చర్చించారు.
షర్మిల కాంగ్రెస్లో చేరేందుకు కాంగ్రెస్ ఢిల్లీ హై కమాండ్ సుముఖంగా ఉందని అయితే రేవంత్ రెడ్డి సహా టి. కాంగ్రెస్ నేతలు పలువురు షర్మిల కాంగ్రెస్ లో చేరినా ఏపీకే పరిమితం కావాలంటూ చేస్తున్న వ్యాఖ్యలు, అభ్యంతరాలపై ఆలోచన చేస్తున్నామని డీకే వెల్లడించినట్లు సమాచారం.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో మొదటి నుంచి సన్నిహితంగా ఉన్న వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లోకి షర్మిలను తీసుకువచ్చేందుకు డీకేతో భేటీ అయినట్లు భావిస్తున్నారు. ఇప్పటికే డీకేతో షర్మిల ఒక పర్యాయం భేటి కావడం గమనార్హం. కాగా తన సోదరుడు బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తిరిగి కాంగ్రెస్ లో చేరే విషయమై డీకేతో వెంకటరెడ్డి చర్చించినట్లు తెలుస్తుంది.
కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ గారిని బెంగళూరులో కలిశారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మర్యాదపూర్వకంగా ఆయన్ను కలవడం జరిగింది. ఈ సందర్భంగా డీకే గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడం కోసం శివకుమార్ గారు ఎంతో కష్టపడ్డారని, నాయకులను ఒకతాటి పైకి తీసుకొచ్చి, కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపి.. పార్టీని గెలుపు వైపు నడిపించినందుకు అభినందనలు తెలిపారు.