Congress | కర్ణాటకలో BJPకి, తెలంగాణలో BRSకు తేడా ఏదీ: రేవంత్‌రెడ్డి
Congress అక్కడ బీజేపీది 40శాతం కమీషన్ సర్కార్, ఇక్కడ బీఆరెస్‌ది 30 శాతం కమీషన్ సర్కార్ బెల్లంపల్లి ఎమ్మెల్యేను పక్కన కూర్చోబెట్టుకోవడానికి సిగ్గనిపించడం లేదా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విధాత: కర్ణాటకలో బీజేపీకి, తెలంగాణలో బీఆర్‌ఎస్ కు పెద్ద తేడా ఏం లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. అక్కడ బీజేపీది 40శాతం కమీషన్ సర్కార్, ఇక్కడ బీఆర్‌ఎస్ ది 30 శాతం కమీషన్ సర్కార్ అని ఎద్దేవా చేశారు. శనివారం గాంధీభవన్‌లో మాజీ మంత్రి గడ్డం […]

Congress
- అక్కడ బీజేపీది 40శాతం కమీషన్ సర్కార్,
- ఇక్కడ బీఆరెస్‌ది 30 శాతం కమీషన్ సర్కార్
- బెల్లంపల్లి ఎమ్మెల్యేను పక్కన కూర్చోబెట్టుకోవడానికి సిగ్గనిపించడం లేదా
- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
విధాత: కర్ణాటకలో బీజేపీకి, తెలంగాణలో బీఆర్‌ఎస్ కు పెద్ద తేడా ఏం లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. అక్కడ బీజేపీది 40శాతం కమీషన్ సర్కార్, ఇక్కడ బీఆర్‌ఎస్ ది 30 శాతం కమీషన్ సర్కార్ అని ఎద్దేవా చేశారు. శనివారం గాంధీభవన్‌లో మాజీ మంత్రి గడ్డం వినోద్ కుమార్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల, భీమిని, కన్నెపల్లి మండలాలకు చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు.
వారందరినీ రేవంత్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్ ను చీల్చేందుకు బీజేపీ, కేసీఆర్ ప్రయత్నించారన్నారు. వందల కోట్లు ఖర్చు చేసి కాంగ్రెస్ ను ఓడించాలనుకున్నారని, కానీ కర్ణాటక ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చి బీజేపీని బండకేసి కొట్టారన్నారు.
దేశమంతా చరిత్ర తెలిసినా…
బెల్లంపల్లి ఎమ్మెల్యే గురించి మాట్లాడేందుకు నాకే సిగ్గనిపిస్తుందని, పక్కన కూర్చోబెట్టుకోవడానికి కేసీఆర్ కు ఏమనిపించడం లేదా? అని రేవంత్ అడిగారు. దేశమంతా ఎమ్మెల్యే చరిత్ర తెలిసినా కేసీఆర్ కు తెలియడంలేదా? అని అన్నారు. అక్కడ ఉన్నది దుర్బుద్ధి చిన్నయ్యా? దుర్గం చిన్నయ్యా? అని ఎద్దేవా చేశారు.
దండుపాళ్యం ముఠా.. శాండ్, ల్యాండ్, మైన్ అవినీతిలో ఎక్కడ చూసినా బీఆర్‌ఎస్ నేతలే ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో బెల్లంపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు మీది క్రియాశీలక పాత్ర అని కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలనుద్దేశించి రేవంత్ అన్నారు.
అనర్హులైన సభ్యులతో జరిగిన నియామకాలపై పునఃసమీక్ష చేయండి..
టీఎస్పీఎస్సీ ద్వారా అనర్హులైన సభ్యులతో జరిగిన అన్ని నియామకాలను పునఃసమీక్షించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రశ్నపత్రాల లీకేజీలో కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసిందని, సీబీఐ కేసు నమోదు చేసి విచారించాలని డిమాండ్ చేశారు.
పేపర్ లీకేజీకి కారణం మంత్రి కేటీఆర్ అన్నారు. కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీకి కారణమైన టీఎస్పీఎఎస్సీ చైర్మన్, సభ్యులను తక్షణమే తొలగించాలన్నారు. నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగం పెరిగిపోయిందని రేవంత్ అన్నారు.
టీఎస్పీఎఎస్సీ కమిషన్ లోపభూయిష్టంగా ఉందన్నారు. టీఎస్పీఎఎస్సీ కమిషన్ సభ్యుల నియామకాలపై హైకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిందని తెలిపారు. పారదర్శకంగా నియామకాలు చేపడుతున్నామన్న ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు అని అన్నారు.