Congress | ఎమ్మెల్యే గానే పోటీ చేస్తా : ఎంపీ వెంకట్ రెడ్డి

Congress విధాత: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ స్ట్రాటజీ కమిటీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజీ కమిటీ సమావేశం చాలా బాగా జరిగిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలో తీసుకొచ్చేందుకు కావాల్సిన అన్ని మార్గాలపై విపులంగా చర్చలు సాగాయన్నారు. తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ సిద్ధమైందన్నారు. బిఆర్ఎస్ […]

Congress | ఎమ్మెల్యే గానే పోటీ చేస్తా : ఎంపీ వెంకట్ రెడ్డి

Congress

విధాత: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ స్ట్రాటజీ కమిటీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజీ కమిటీ సమావేశం చాలా బాగా జరిగిందన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలో తీసుకొచ్చేందుకు కావాల్సిన అన్ని మార్గాలపై విపులంగా చర్చలు సాగాయన్నారు. తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ సిద్ధమైందన్నారు. బిఆర్ఎస్ తో కాంగ్రెస్ ఎలాంటి పొత్తు పెట్టుకోవడం లేదని, ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయనుందన్నారు.

జనరల్ స్థానంలో బీసీలకు సీట్లు ఇవ్వాలని తాను రాహుల్ గాంధీని కోరినట్లు తెలిపారు. వచ్చే నెలలో క్లారిటీ ఉన్న సీట్లలో టికెట్ల ప్రకటన ఉంటుందన్నారు. సర్వేల ఆధారంగానే పార్టీ టికెట్లు కేటాయిస్తుందన్నారు. తెలంగాణకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తానని రాహుల్ చెప్పారన్నారు.

పార్టీకి దూరమైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు తగిన స్థానం కల్పించనున్నట్లు రాహుల్ చెప్పారన్నారు. నా సోదరుడు రాజగోపాల్ రెడ్డి గురించి నాకు తెలియదని, మేము కలిసినప్పుడు కూడా రాజకీయాలు చర్చించమన్నారు. కెసిఆర్ కుటుంబం అవినీతి లెక్కలు తేల్చి ప్రజల ముందు ఉంచాలని, ధరణిపై కమిటీ వేయాలని స్ట్రాటజీ కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు.