పీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డిని చేయాలి: కోమటిరెడ్డి
జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ అయితే కాంగ్రెస్‌కు లాభమని కోమటిరెడ్డి వ్యాఖ్య. తెలంగాణ కాంగ్రెస్‌లో నేతృత్వ మార్పుపై చర్చ జోరందుకుంది.
విధాత, హైదరాబాద్ : పీసీసీ అధ్యక్షుడిగా టి. జగ్గారెడ్డిని చేయాలని.. ఆయన ఎప్పుడూ జనంలో ఉండే మాస్ లీడర్ ఆయన అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చిట్‌చాట్‌గా మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డిని చేయాలని కోరారు. జగ్గారెడ్డి మరో పీజేఆర్ అని.. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే ఆదుకుంటారని చెప్పుకొచ్చారు. ఆయన పీసీసీ చీఫ్ అయితే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు వస్తాయని పేర్కొన్నారు.
వెంకట్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుత పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను కాంగ్రెస్ హైకమాండ్ మార్చవచ్చన్న ప్రచారానికి తెర లేపింది. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరుగుతుందని, అందులో భాగాంగానే పీసీసీ చీప్ మార్పు జరుగుతుందన్న వాదన వినిపిస్తుంది. గతంలో జగ్గారెడ్డి తను ఇకమీదట ఎన్నికల్లో పోటీ చేయబోనని, తన లక్ష్యం పీసీసీ చీఫ్, సీఎం పదవి అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
హరీశ్ రావు ఆరోపణలు అవాస్తవం
హ్యామ్ రోడ్లపై రూ.18వేల కోట్ల కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి టి.హరీశ్ రావు చేసిన ఆరోపణలను మంత్రి వెంకట్ రెడ్డి కొట్టిపారేశారు. అసలు అన్ని కోట్ల టెండర్లు పిలవనప్పుడు అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి :
నేను పార్టీ మారడానికి సంజయ్‌నే కారణం: మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి
Srinagar Tulip Garden : శ్రీనగర్ తులిప్ గార్డెన్ ప్రారంభం..సందర్శకుల వెల్లువ
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram