ట్ర‌క్కులో మంట‌లు.. ప‌ర్‌ఫ్యూమ్స్ ఎత్తుకెళ్లిన స్థానికులు.. వీడియో

విధాత : గుజ‌రాత్‌లోని వ‌ల్స‌డ్ జిల్లాలో శ‌నివారం తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. జాతీయ ర‌హ‌దారి 48పై వెళ్తున్న ట్ర‌క్కులో ఆక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన కంటైన‌ర్ డ్రైవ‌ర్.. వాహనాన్ని ఆపి త‌న ప్రాణాల‌ను ర‌క్షించుకున్నాడు. షాంపూలు, ప‌ర్‌ఫ్యూమ్స్, హ్యాండ్ వాష్‌ల‌ను ముంబై నుంచి అహ్మ‌దాబాద్‌కు త‌ర‌లిస్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసింది. మంట‌లు పూర్తిగా అదుపులోకి వ‌చ్చిన త‌ర్వాత స్థానికులు […]

ట్ర‌క్కులో మంట‌లు.. ప‌ర్‌ఫ్యూమ్స్ ఎత్తుకెళ్లిన స్థానికులు.. వీడియో

విధాత : గుజ‌రాత్‌లోని వ‌ల్స‌డ్ జిల్లాలో శ‌నివారం తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. జాతీయ ర‌హ‌దారి 48పై వెళ్తున్న ట్ర‌క్కులో ఆక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన కంటైన‌ర్ డ్రైవ‌ర్.. వాహనాన్ని ఆపి త‌న ప్రాణాల‌ను ర‌క్షించుకున్నాడు.

షాంపూలు, ప‌ర్‌ఫ్యూమ్స్, హ్యాండ్ వాష్‌ల‌ను ముంబై నుంచి అహ్మ‌దాబాద్‌కు త‌ర‌లిస్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసింది. మంట‌లు పూర్తిగా అదుపులోకి వ‌చ్చిన త‌ర్వాత స్థానికులు ప‌ర్‌ఫ్యూమ్స్, హ్యాండ్ వాష్ బాటిల్స్‌ను తీసుకెళ్లారు. అగ్నిప్ర‌మాదానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.