Minister Srinivas Goud | మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికపై హైకోర్టు కీలక నిర్ణయం

Minister Srinivas Goud | అడ్వకేట్ కమిషన్ నియామకం విచారణ 12కు వాయిదా విధాత, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎన్నిక వివాదంలో హైకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అఫిడవిట్ ట్యాంపరింగ్ కేసు విచారణ ఎదుర్కోంటున్న శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికపై హైకోర్టు అడ్వకేట్ కమిషన్‌ను నియమించింది. తదుపరి విచారణ 12వ తేదికి వాయిదా వేసింది. అడ్వకేట్ కమిషన్ సాక్షులను విచారించి, ఎవిడెన్సలను పరిశీలించి ఈ నెల 11వ లోపు విచారణ పూర్తి చేయనుంది. విచారణలో భాగంగా కమిషన్ ఈనెల 8న […]

  • By: krs |    latest |    Published on : Sep 04, 2023 11:55 PM IST
Minister Srinivas Goud | మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికపై హైకోర్టు కీలక నిర్ణయం

Minister Srinivas Goud |

  • అడ్వకేట్ కమిషన్ నియామకం
  • విచారణ 12కు వాయిదా

విధాత, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎన్నిక వివాదంలో హైకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అఫిడవిట్ ట్యాంపరింగ్ కేసు విచారణ ఎదుర్కోంటున్న శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికపై హైకోర్టు అడ్వకేట్ కమిషన్‌ను నియమించింది. తదుపరి విచారణ 12వ తేదికి వాయిదా వేసింది.

అడ్వకేట్ కమిషన్ సాక్షులను విచారించి, ఎవిడెన్సలను పరిశీలించి ఈ నెల 11వ లోపు విచారణ పూర్తి చేయనుంది. విచారణలో భాగంగా కమిషన్ ఈనెల 8న మెదక్ ఆర్డీవో, 11న నల్లగొండ అడిషనల్ కలెక్టర్ స్టేట్‌మెంట్‌ను కమిషన్ రికార్డు చేయనుంది. సాక్షులను కూడా విచారణ కోసం అడ్వకేట్ కమిషన్ ముందు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది.

ఇప్పటికే బీఆరెస్ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావుపైన, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌ రెడ్డి పైన కోర్టు అనర్హత వేటు వేయగా మరికొందరి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ కూడా కీలక దశలో ఉంది. ఈ నెలఖారులోగా కనీసంగా మరో పదిమందికి పైగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల పైనా తుది తీర్పు వెలువడవచ్చని భావిస్తున్నారు.