CPR | 23 రోజుల ప‌సికందుకు సీపీఆర్.. ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది

CPR | స్నానం చేయిస్తుండ‌గా నీళ్లు మింగిన ప‌సిపాప‌( Infant )కు శ్వాస ఆగిపోయింది. గుండె( Heart ), నాడీ కొట్టుకోవ‌డం కూడా ఆగిపోయాయి. స‌కాలంలో స్పందించిన 108 అంబులెన్స్( 108 Ambulance ) సిబ్బంది ఆ ప‌సికందుకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. వివ‌రాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా( Siddipeta dist ) చిన్న‌కోడూరు మండ‌లం చ‌ద్లాపూర్‌లోని మెగా క్యాంపు కార్యాల‌యంలో బీహార్‌( Bihar )కు చెందిన ప్రేమ్‌నాథ్ యాద‌వ్‌, క‌విత దంప‌తులు నివాస‌ముంటున్నారు. క‌విత […]

CPR | 23 రోజుల ప‌సికందుకు సీపీఆర్.. ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది

CPR | స్నానం చేయిస్తుండ‌గా నీళ్లు మింగిన ప‌సిపాప‌( Infant )కు శ్వాస ఆగిపోయింది. గుండె( Heart ), నాడీ కొట్టుకోవ‌డం కూడా ఆగిపోయాయి. స‌కాలంలో స్పందించిన 108 అంబులెన్స్( 108 Ambulance ) సిబ్బంది ఆ ప‌సికందుకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా( Siddipeta dist ) చిన్న‌కోడూరు మండ‌లం చ‌ద్లాపూర్‌లోని మెగా క్యాంపు కార్యాల‌యంలో బీహార్‌( Bihar )కు చెందిన ప్రేమ్‌నాథ్ యాద‌వ్‌, క‌విత దంప‌తులు నివాస‌ముంటున్నారు. క‌విత 23 రోజుల క్రితం పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. రోజూ మాదిరిగానే బుధ‌వారం ఉద‌యం కూడా పాప‌కు స్నానం చేయించింది. అయితే స్నానం చేయిస్తుండ‌గా పాప నీళ్లు మింగ‌డంతో శ్వాస ఆగిపోయింది. అప్ర‌మ‌త్త‌మైన ప్రేమ్‌నాథ్‌, క‌విత ఏఎన్ఎం తిరుమ‌ల‌, ఆశా వ‌ర్క‌ర్ సుగుణ‌కు స‌మాచారం అందించారు. వారిద్ద‌రూ క‌లిసి 108 అంబులెన్స్ సిబ్బందికి విష‌యాన్ని తెలియ‌జేశారు.

హుటాహుటిన మెగా క్యాంపు కార్యాల‌యానికి చేరుకున్న 108 సిబ్బంది పాప‌ను ప‌రీక్షించారు. గుండె, నాడీ కొట్టుకోవ‌డం లేద‌ని నిర్ధారించారు. క్ష‌ణం కూడా ఆల‌స్యం చేయ‌కుండా, ప‌సిపాప‌కు సీపీఆర్ చేశారు. కాసేప‌టికే పాప స్పృహాలోకి వ‌చ్చింది. అనంత‌రం శిశువును సిద్దిపేట జిల్లా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. స‌కాలంలో స్పందించి ప‌సిపాప ప్రాణాన్ని కాపాడిన 108 సిబ్బందికి కుటుంబ స‌భ్యులు, బంధువులు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.