Cricketer | తండ్రి మ‌ర‌ణంతో.. గ‌తి లేక డ్రైవ‌ర్‌ని అవుదామ‌ని అనుకున్నా: స్టార్ క్రికెట‌ర్

Cricketer | టీమిండియాకి త‌న అద్భుత‌మైన స్పిన్‌తో ఎన్నో విజ‌యాలు అందించిన క్రికెట‌ర్ హ‌ర్భజన్ సింగ్. ఆయ‌న తండ్రి సర్ధార్ సర్‌దేవ్ సింగ్ ప్లాహాకి మొత్తం ఆరుగురు సంతానం కాగా, ఆయ‌న అక్కా చెల్లెళ్ల మ‌ధ్య ఎంతో అల్లారుముద్దుగా పెరిగాడు. భ‌జ్జీ తండ్రి సర్దార్ సర్‌దేవ్ సింగ్‌కి బాల్ బేరింగ్ బిజినెస్ ఉండ‌గా, ఆ వ్యాపారాన్ని చూసుకుందామని హర్భజన్ సింగ్ అనుకున్నాడ‌ట‌. కానీ ఆయ‌న తండ్రి మాత్రం హ‌ర్భ‌జ‌న్ సింగ్‌లోని క్రికెట్ నైపుణ్యం చూసి అత‌నికి ట్రైయినింగ్ […]

  • By: sn    latest    Aug 31, 2023 2:48 AM IST
Cricketer | తండ్రి మ‌ర‌ణంతో.. గ‌తి లేక డ్రైవ‌ర్‌ని అవుదామ‌ని అనుకున్నా: స్టార్ క్రికెట‌ర్

Cricketer |

టీమిండియాకి త‌న అద్భుత‌మైన స్పిన్‌తో ఎన్నో విజ‌యాలు అందించిన క్రికెట‌ర్ హ‌ర్భజన్ సింగ్. ఆయ‌న తండ్రి సర్ధార్ సర్‌దేవ్ సింగ్ ప్లాహాకి మొత్తం ఆరుగురు సంతానం కాగా, ఆయ‌న అక్కా చెల్లెళ్ల మ‌ధ్య ఎంతో అల్లారుముద్దుగా పెరిగాడు. భ‌జ్జీ తండ్రి సర్దార్ సర్‌దేవ్ సింగ్‌కి బాల్ బేరింగ్ బిజినెస్ ఉండ‌గా, ఆ వ్యాపారాన్ని చూసుకుందామని హర్భజన్ సింగ్ అనుకున్నాడ‌ట‌.

కానీ ఆయ‌న తండ్రి మాత్రం హ‌ర్భ‌జ‌న్ సింగ్‌లోని క్రికెట్ నైపుణ్యం చూసి అత‌నికి ట్రైయినింగ్ ఇప్పించాడ‌ట‌. ముందుగా బ్యాట‌ర్‌గా ప్రాక్టీస్ మొద‌లు పెట్టిన భ‌జ్జీ ఆ త‌ర్వాత బౌల‌ర్‌గా మారి సూప‌ర్ స‌క్సెస్ అయ్యాడు. హర్భ‌జ‌న్ సింగ్ ప్ర‌తి రోజు కూడా సూర్యోదయానికి ముందు మూడు గంటలు, సూర్యాస్తమయం తర్వాత మరో మూడు గంటలు ప్రాక్టీస్ చేసేవాడ‌ట‌.

అయితే భ‌జ్జీ క్రికెట‌ర్‌గా ఎదుగుతున్న స‌మ‌యంలోనే 2000వ సంవత్సరంలో సర్ధార్ సర్‌దేవ్ మరణించారు. దాంతో ఆయన జీవితం త‌ల‌కిందులు అయింది. ఆయ‌న త‌న కుటుంబాన్ని పోషించుందుకే అమెరికాలో ఓ ట్రక్కు డ్రైవర్‌గా పని చేయాలని భ‌జ్జీ భావించాడ‌ట‌.

కానీ ఆ స‌మ‌యంలో అతని అక్కాచెల్లెలు, భజ్జీకి ఎంతో స‌పోర్ట్‌గా ఉన్నార‌ట‌. స‌ర్ధార్ కోరుకున్న‌ట్టు నువ్వు క్రికెట‌ర్‌గా కొన‌సాగు, మేము కుటుంబ ఖ‌ర్చుల‌ని భ‌రిస్తాము అని వారు భ‌రోసా ఇవ్వ‌డంతో అప్ప‌టి నుండి పూర్తిగా క్రికెట్‌పైనే దృష్టి పెట్టి 2001 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో అనిల్ కుంబ్లే గాయ‌ప‌డ‌డంతో భార‌త జ‌ట్టులోకి వ‌చ్చిన హ‌ర్భ‌జ‌న్ అద‌ర‌గొట్టాడు.

ఇక అప్ప‌టి నుండి టీమిండియాకి ప్రధాన స్పిన్నర్‌గా మారిపోయిన భ‌జ్జీ.. క్రికెటర్‌గా సక్సెస్ సాధించిన తర్వాత త‌న ముగ్గురు అక్కా చెల్లెళ్ల పెళ్లిళ్లు చేశారు. 2010 సమయానికి అక్కాచెల్లెలందరి పెళ్లిళ్లు చేసిన హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఎట్టకేలకు 2015లో గీతా బస్రాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

అయితే త‌న‌కి త‌న అక్కా చెల్లెళ్ల స‌పోర్ట్ లేక‌పోతే ట్ర‌క్కు న‌డుపుకుంటూ ఉండేవాడిని అని అంటాడు. ఇక ఇప్పుడు ఆయ‌న రాజ్యసభ గౌరవ సభ్యుడిగా, క్రికెట్ కామెంటేటర్‌గా రాణిస్తున్నాడు. అలానే అప్పుడ‌ప్పుడు సినిమాల‌లో క‌నిపిస్తూ సంద‌డి చేస్తున్నాడు.