లెజెండ్స్ లీగ్‌ క్రికెట్‌.. రైనా టీమ్‌పై ఘ‌న విజ‌యం సాధించి ఛాంపియ‌న్‌గా హ‌ర్భ‌జన్ జ‌ట్టు

లెజెండ్స్ లీగ్‌ క్రికెట్‌.. రైనా టీమ్‌పై ఘ‌న విజ‌యం సాధించి ఛాంపియ‌న్‌గా హ‌ర్భ‌జన్ జ‌ట్టు

రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ఆట‌గాళ్లు తిరిగి గ్రౌండ్‌లో అడుగుపెట్టి త‌మ అభిమానులని ఎంత‌గానో అల‌రిస్తున్నారు. లెజెండ్స్‌ క్రికెట్‌లీగ్ లో భాగంగా పాత‌తరం ఆట‌గాళ్లు ఇప్పుడు అద్భుత‌మైన బ్యాటింగ్, బౌలింగ్‌తో వీక్ష‌కుల‌ని అల‌రిస్తున్నారు. త‌మ‌లో ఇంకా ప‌స త‌గ్గ‌లేద‌ని నిరూపిస్తున్నారు. గ‌త కొద్ది రోజులుగా లెజెండ్స్ లీగ్ క్రికెట్ జ‌రుగుతుండ‌గా, ఇందులో హర్భజన్‌ సింగ్‌ నేతృత్వంలోని మణిపాల్‌ టైగర్స్‌ టీమ్‌ ఛాంపియన్‌గా నిలిచింది. సూరత్‌లోని లాల్‌భాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఆజట్టు 5 వికెట్ల తేడాతో సురేశ్‌ రైనా సారథ్యంలోని అర్బన్ రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి ట్రోఫీ ద‌క్కించుకుంది.

ముంద‌గా రైనా జ‌ట్టు బ్యాటింగ్ చేయ‌గా, వారు 188 ప‌రుగుల ల‌క్ష్యాన్ని రైనా జ‌ట్టు ముందు ఉంచారు. అర్బన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 జ‌ట్టుకి స‌రైన ఆరంభం లభించ‌లేదు. ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (0), డ్వేన్ స్మిత్ (21) ఆరంభంలోనే త్వ‌ర‌గానే ఔట‌య్యారు. ఆ త‌ర్వాత రికీ క్లర్క్ 52 బంతుల్లో 4 భారీ సిక్సర్లు, 6 ఫోర్లతో అజేయంగా 80 పరుగులు చేసి టీంకి మంచి స్కోరు అందించాడు. మ‌రోవైపు అత‌నికి గురుకీరత్ సింగ్ 36 బంతుల్లో 2 సిక్సర్లు, 8 ఫోర్లతో 64 పరుగులు చ‌క్క‌ని స‌హకారం అందించాడు. ఈ క్ర‌మంలోనే అర్బన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. మణిపాల్ బౌలర్లలో పంకజ్‌ సింగ్‌ 2 వికెట్లు తీసుకోగా, థిసారా పెరీర్‌ ఒక వికెట్ ద‌క్కింది.

ఇక 188 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన మ‌ణిపాల్ టైగర్స్ జ‌ట్టు 5 వికెట్స్ కోల్పోయి విజ‌యం సాధించింది. 19 ఓవ‌ర్ల‌లో 193 ప‌రుగులు చేసి ఘ‌న విజ‌యం సాధించారు. ఈ జ‌ట్టులో సేల గుణరత్నే 29 బంతుల్లో 5 భారీ సిక్సర్లతో అజేయంగా 51 పరుగులు చేసి త‌మ జ‌ట్టుకి ట్రోఫీ ద‌క్కేలా చేశాడు. మ‌రోవైపు ఈ జ‌ట్టులో ఓపెనర్ రాబిన్ ఉతప్ప (40) మంచి నాక్ ఆడాడు. చాడ్విక్ వాల్టన్ (29) , ఏంజెలో పెరీరా 30 పరుగులు , తిసార పెరీరా 25 పరుగులు , అసేల గుణరత్నే 29 బంతుల్లో 5 భారీ సిక్సర్లతో అజేయంగా 51 పరుగులు చేసారు. మొత్తానికి హ‌ర్భ‌జ‌న్ జ‌ట్టు రైనా జ‌ట్టుపై విజ‌యం సాధించి ఛాంపియ‌న్స్‌గా నిలిచారు.