Crickets | అమెరికాపై దండెత్తిన మిడతల దండు
Crickets | విధాత: అమెరికా(America)లో ఆశ్చర్యకరంగా ఒక నగరంపై మిడతల దండు దండెత్తింది. లక్షల కొద్దీ కీటకాలు నగర వీధుల్లో కవాతు చేస్తున్నాయి. ఈ పద ఘట్టనల శబ్దం భారీ వర్షం పడుతున్నపుడు వచ్చే శబ్దాన్ని గుర్తుకు తెస్తోందని నగర వాసులు పేర్కొంటున్నారు. నెవాడా (Nevada) రాష్ట్రంలోని ఎల్కో నగరంలో ఈ ఘటన జరిగింది. ఈ మిడత (Crickets) ల వల్ల నగర వాసుల దైనందిన కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది. చాలా రోడ్డు మార్గాలను ఇవి ఆక్రమించడంతో […]

Crickets |
విధాత: అమెరికా(America)లో ఆశ్చర్యకరంగా ఒక నగరంపై మిడతల దండు దండెత్తింది. లక్షల కొద్దీ కీటకాలు నగర వీధుల్లో కవాతు చేస్తున్నాయి. ఈ పద ఘట్టనల శబ్దం భారీ వర్షం పడుతున్నపుడు వచ్చే శబ్దాన్ని గుర్తుకు తెస్తోందని నగర వాసులు పేర్కొంటున్నారు.
నెవాడా (Nevada) రాష్ట్రంలోని ఎల్కో నగరంలో ఈ ఘటన జరిగింది. ఈ మిడత (Crickets) ల వల్ల నగర వాసుల దైనందిన కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది. చాలా రోడ్డు మార్గాలను ఇవి ఆక్రమించడంతో అంబులెన్సు, ఫైర్ ఇంజిన్ వంటి సర్వీసులు పని చేయడం లేదు. ఇవి ఇళ్లల్లోకి, కార్యాలయాల్లోకీ వస్తుండటంతో ఎవరూ బయటకు రావడం లేదు.
దీంతో నగరం మొత్తం నిర్మానుష్యంగా మారింది. నగరంలో పరిస్థితి హాలీవుడ్ హార్రర్ మూవీలా ఉందని, వాటంతట అవి పోయే వరకు చూడటం తప్ప చేయగలిగిందేమీ లేదని నగర అధికారులు స్పష్టం చేశారు. మిడతలు అడవిలోంచి నగరంలోకి రోడ్డు మీదుగా ఫొటోను షేర్ చేస్తూ.. ఇవి ఎండిపోయిన ఆకులో.. బురదో కాదు.. నగరంలోకి వస్తున్న మిడతల దండు అని స్థానిక మీడియా సంస్థ ఒకటి ఫొటోను ట్వీట్ చేసింది.
ఈ పరిణామాలపై పలువురు పౌరులు తమ ఇబ్బందులను రాసుకొచ్చారు. ఈ కీటకాలు ఎక్కడికక్కడ మలవిసర్జన చేస్తుండటంతో దుర్వాసన తట్టుకోలేకపోతున్నామని డ్రేక్ అనే స్థానికుడు తెలిపాడు. తాము బటయకు రావట్లేదని ఇంట్లోనే చిక్కుకుపోయామన్నాడు. నగరంలోని ఆస్పత్రుల్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది.
కదల్లేని స్థితిలో ఉన్నవారిపై మిడతలు దాడి చేస్తున్నాయని.. దీంతో తాము కొన్నిట్రాక్టర్లకు పొగ యంత్రాలు పెట్టి పరిస్థితిని అదుపుచేస్తున్నామని ఒక ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. మిడతల దాడిపై ఎంటమాలజిస్ట్ జెఫ్ నైట్ స్పందిస్తూ.. ప్రతి ఐదారేళ్లకోసారి మిడతల జీవన చక్రం మొదలవుతుందన్నారు. కొన్ని రోజులకు పరిస్థితి దానికదే చక్కబడుతుందని తెలిపారు.