CSK vs MI| ముంబై వ‌ర్సెస్ చెన్నై హై ఓల్టేజ్ మ్యాచ్..ధోని, రోహిత్ మెరుపులు..ముస్తాఫిజుర్ కళ్లు చెదిరే క్యాచ్

CSK vs MI| ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ దుమ్ములేపుతూనే ఉంది. ఆదివారం రోజు ముంబై ఇండియన్స్‌తో వాంఖడే మైదానం వేదికగా జరిగిన హైఓల్టేజ్‌ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో ముంబైపై ఘ‌న విజ‌యం సాధించింది. గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్‌

  • By: sn    latest    Apr 15, 2024 6:50 AM IST
CSK vs MI| ముంబై వ‌ర్సెస్ చెన్నై హై ఓల్టేజ్ మ్యాచ్..ధోని, రోహిత్ మెరుపులు..ముస్తాఫిజుర్ కళ్లు చెదిరే క్యాచ్

CSK vs MI| ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ దుమ్ములేపుతూనే ఉంది. ఆదివారం రోజు ముంబై ఇండియన్స్‌తో వాంఖడే మైదానం వేదికగా జరిగిన హైఓల్టేజ్‌ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో ముంబైపై ఘ‌న విజ‌యం సాధించింది. గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69), శివమ్ దూబే(38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66 నాటౌట్) హాఫ్ సెంచరీలతో విరుచుకుప‌డ‌గా.. చివరి ఓవర్‌లో మహేంద్ర సింగ్ ధోనీ(4 బంతుల్లో 3 సిక్స్‌లతో 20 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. దీంతో చెన్నై స్కోర్ బోర్డ్ ప‌రుగులు పెట్టింది. ఇక ముంబై ఇండియన్స్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. గెరాల్డ్ కోయిట్జీ, శ్రేయస్ గోపాల్ ఒక్కో వికెట్ తీసారు

ఇక భారీ ల‌క్ష్య చేధ‌న‌కి బ‌రిలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్ మొద‌ట్లో ధీటుగానే ఆడింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ ఆకాశ‌మే హ‌ద్దుగా రెచ్చిపోయి ఆడారు. పవ‌ర్ ప్లేలో ఒక్క వికెట్ కోల్పోకుండా వీరిద్ద‌రు క‌లిసి 63 ప‌రుగులు చేశారు. మతీష పతీరణ ఎంట్రీ గేమ్ స్వ‌రూపం మారింది. ఒకే ఓవర్‌లో ఇషాన్ కిషన్(23), సూర్యకుమార్ యాదవ్(0)లను పెవిలియన్ పంపాడు. ముస్తాఫిజుర్ బౌండరీ లైన్ వద్ద సూపర్ క్యాచ్ ప‌ట్ట‌డంతో ఒక్క ప‌రుగు చేయకుండానే సూర్య కుమార్ వెనుదిరిగాడు. సమన్వయం కోల్పోయిన అతను సమయస్పూర్తితో బంతిని గాల్లోకి విసిరి మ‌ళ్లీ అందుకోవ‌డం విశేషం. అయితే రోహిత్ శర్మ(63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 105 నాటౌట్) , తిలక్ వర్మ(20 బంతుల్లో 5 ఫోర్లతో 31) ఉన్నంత సేపు మ్యాచ్‌పై ఆశ‌లు ఉన్నాయి.

కాని తిల‌క్ వ‌ర్మ ఔట‌యిన త‌ర్వాత ఒక్కొక్క వికెట్ ప‌డుతూ వ‌చ్చింది. హిట్ట‌ర్ రోమారియో షెఫర్డ్(1)ను కూడా పతీరణ క్లీన్ బౌల్డ్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆ త‌ర్వాత శార్ధూల్, తుషార్, ప‌తిర‌ణ టైట్ బౌలింగ్ చేయ‌డంతో ప‌రుగులు రావ‌డం క‌ష్టంగా మారింది. చివరి ఓవర్‌లో బౌండరీ బాదిన రోహిత్ 61 బంతుల్లో సెంచ‌రీ పూర్తి చేసుకోగా, గెలిచే ప‌రిస్తితి లేనందున రోహిత్ త‌న సెంచ‌రీ సెల‌బ్రేష‌న్స్ చేసుకోలేదు. మొత్తానికి మతీష పతీరణ(4/28) సంచలన బౌలింగ్‌తో చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు.