Twitter X: ట్విటర్ ఎక్స్ పై సైబర్ అటాక్ : ఎలాన్ మస్క్
ట్విటర్ ఎక్స్ పై ప్రతిరోజు సైబర్ దాడి జరుగుతుందని.. ప్రస్తుత దాడుల వెనుక ఏదైన పెద్ధ గ్రూప్, దేశం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దాడికి సంబంధించి ఐపీ అడ్రస్‌లు ఉక్రెయిన్ నుంచి ఉన్నట్లు గుర్తించామని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ వెల్లడించారు.

Twitter X: ప్రముఖ సామాజిక మాధ్యమం(X outages) ఎక్స్(ట్విటర్) సోమవారం ఆకస్మాత్తుగా డౌన్ కావడానికి సైబర్ అటాక్ కారణమని ఎక్స్ యాజమాని బిలినియర్ ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. మేం ప్రతిరోజు సైబర్ దాడికి గురవుతున్నామని, ప్రస్తుత దాడుల వెనుక ఏదైన పెద్ధ గ్రూప్, దేశం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దాడికి సంబంధించి ఐపీ అడ్రస్‌లు ఉక్రెయిన్ నుంచి ఉన్నట్లు గుర్తించామని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ వెల్లడించారు.
సోమవారం ఒక్క రోజులోనే మూడు సార్లు సేవలు నిలిచిపోయాయని.. దీనికి వెనుక సైబర్ నేరగాళ్ల హస్తం ఉందని ఎలాన్ మస్క్ ఆరోపించారు. ట్రేసింగ్ సైట్ ‘డౌన్‌డిటెక్టర్’ ప్రకారం ఎక్స్ సేవల్లో సోమవారం మూడు సార్లు అంతరాయం ఏర్పడింది. తొలుత మధ్యాహ్నం 3 గంటల సమయంలో పలువురు యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై భారత్‌లోని 2,000 మంది యూజర్లు ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత రాత్రి 7.30 గంటల సమయంలో మరోసారి ఎక్స్ డౌన్ అయింది. అప్పుడు కూడా 1,500 మంది భారతీయ యూజర్లు సమస్యపై నివేదించారు. మళ్లీ రాత్రి 9 గంటలకు సేవల్లో అంతరాయం నెలకుంది. దీంతో లక్షల మంది యూజర్లు ఎక్స్‌ను వినియోగించుకోలేకపోయారు. అమెరికా, ఇండియా, యూకే, అస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో ఎక్స్ సేవలకు అంతరాయం ఏర్పడగా..40వేల మంది యూజర్లు దీనిపై ఫిర్యాదు చేశారు.