Naveen Vijay Krishna | నాన్న సరైన నిర్ణయమే తీసుకున్నాడు.. నరేష్, పవిత్రల బంధంపై కొడుకు నవీన్ విజయకృష్ణ షాకింగ్ కామెంట్స్

Naveen Vijay Krishna | నరేష్, పవిత్ర ఈ పేర్లు చెప్పగానే వాళ్ళ లేటు వయసు ప్రేమ గుర్తుకు వస్తుంది. నరేష్, పవిత్ర కొన్ని సంవత్సరాలుగా లివింగ్ రిలేషన్‌లో ఉంటున్నారు. వారి గురించి మొన్నీ మధ్య ఎలాంటి వార్తలు వైరల్ అయ్యాయో తెలియంది కాదు. ఇంకా వారి బంధం ఎవరికైనా తెలియదేమో అని.. సినిమా తీసి మరీ అందరికీ తెలిసేలా చేశాడు నరేష్. ‘మళ్లీ పెళ్ళి’ అంటూ వచ్చిన ఆ సినిమాపై కూడా పెద్ద కాంట్రవర్సీనే నడిచింది. […]

  • Publish Date - August 29, 2023 / 08:36 AM IST

Naveen Vijay Krishna |

నరేష్, పవిత్ర ఈ పేర్లు చెప్పగానే వాళ్ళ లేటు వయసు ప్రేమ గుర్తుకు వస్తుంది. నరేష్, పవిత్ర కొన్ని సంవత్సరాలుగా లివింగ్ రిలేషన్‌లో ఉంటున్నారు. వారి గురించి మొన్నీ మధ్య ఎలాంటి వార్తలు వైరల్ అయ్యాయో తెలియంది కాదు. ఇంకా వారి బంధం ఎవరికైనా తెలియదేమో అని.. సినిమా తీసి మరీ అందరికీ తెలిసేలా చేశాడు నరేష్. ‘మళ్లీ పెళ్ళి’ అంటూ వచ్చిన ఆ సినిమాపై కూడా పెద్ద కాంట్రవర్సీనే నడిచింది.

అయితే మూడో భార్య ఉండగానే నరేష్.. పవిత్రతో సంబంధం కోసం పాకులాడటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదే విషయంపై తాజాగా నరేష్ పెద్ద కొడుకు నవీన్ విజయకృష్ణ ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. తన తండ్రి తీసుకున్న నిర్ణయాన్ని నవీన్ సమర్ధించాడు. మా ఫ్యామిలీలో అంతా చాలా స్వతంత్రంగా ఉంటాం. ఎవరి నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటాం.

ఈ నిర్ణయాలతో ఇబ్బంది పడినా, నేను ఎవరినీ తప్పుబట్టను అన్నాడు. మా ఫ్యామిలీ గురించి చాలా మంది మాట్లాడారు. అవన్నీ పట్టించుకుంటూ జనాలకు నచ్చినట్టు మన జీవితాలను జీవించలేం. మా నాన్న తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తాను. ఈ నిర్ణయంతో ఆయన సంతోషంగా ఉన్నారా? లేదా? అనేది చూస్తాను.

ఇక ఎవరేం అనుకున్నా నాన్న తన పని తాను చేసుకు పోతారు. ఆయనలో ఉన్న మంచి లక్షణం అదే. ఇక పవిత్ర నాకు చాలాకాలం నుంచి తెలుసు. ఆమె మంచి వ్యక్తి. నేను ఆమెను పవిత్ర గారు అని పిలుస్తాను. నా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందంటే ఆమె విష్ చేస్తారు.. అని తండ్రి నిర్ణయంపై తన పూర్తి మద్దతును తెలియజేశాడు నవీన్.

ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసిన ముదురు జంట నరేష్, పవిత్రల విషయంపై నవీన్ విజయ కృష్ణ రెస్పాండ్ అయిన తీరు హుందాగా అనిపించినా.. కొడుకుగా ఓకే. కానీ సామాన్యుడిగా ఆలోచించి ఈ మాట చెప్పగలవా? అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం.

ఇక నవీన్ విషయానికి వస్తే.. ఆయన కష్టపడే వ్యక్తి. హీరోగా సినీ ఇండస్ట్రీలో తన జాతకాన్ని పరీక్షించు కున్నాడు కానీ ఫలితం దక్కలేదు. ఇక దర్శకుడిగా మారి ‘ది సోల్ ఆఫ్ సత్య’ అనే టైటిల్‌తో రీసెంట్‌గా ఓ షార్ట్ ఫిల్మ్ చేశాడు.

ఈ షార్ట్ ఫిల్మ్‌లో సాయి ధరమ్ తేజ్, కలర్స్ స్వాతి భార్యభర్తలుగా నటించారు. సాంగ్ రూపంలో చేసిన ఈ ‘ది సోల్ ఆఫ్ సత్య’ షార్ట్ ఫిల్మ్‌ని బాగానే ప్రమోట్ చేశాడు నవీన్. దీనికి ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందనే వచ్చింది.

Latest News