Daggubati Raja | మీసం మెలేస్తున్నాడు.. ఈసారైనా నాటి ఈ దగ్గుబాటి హీరో నిలబడతాడా..?
Daggubati Raja | దగ్గుబాటి రాజా.. ఈ పేరు ఇప్పుడున్న జనరేషన్‌కి పెద్దగా తెలియక పోవచ్చు కానీ.. ఒకప్పుడు కాస్త గుర్తింపు ఉన్న నటుడే. అప్పట్లో ‘చిన్నారి స్నేహం’ అనే సినిమాలో ఇద్దరు హీరోలలో ఒకరిగా దగ్గుబాటి రాజా నటించారు. తమిళనాట కూడా మంచి గుర్తింపు ఉంది. ఇంకా చెప్పాలంటే ‘శ్రీ ఏడుకొండల స్వామి’ అనే సినిమాలోనూ ఆయన హీరోగా నటించారు. ఇప్పటికీ ఆ సినిమా, అందులోని పాటలు మనకు ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంటాయి. […]

Daggubati Raja |
దగ్గుబాటి రాజా.. ఈ పేరు ఇప్పుడున్న జనరేషన్‌కి పెద్దగా తెలియక పోవచ్చు కానీ.. ఒకప్పుడు కాస్త గుర్తింపు ఉన్న నటుడే. అప్పట్లో ‘చిన్నారి స్నేహం’ అనే సినిమాలో ఇద్దరు హీరోలలో ఒకరిగా దగ్గుబాటి రాజా నటించారు. తమిళనాట కూడా మంచి గుర్తింపు ఉంది. ఇంకా చెప్పాలంటే ‘శ్రీ ఏడుకొండల స్వామి’ అనే సినిమాలోనూ ఆయన హీరోగా నటించారు. ఇప్పటికీ ఆ సినిమా, అందులోని పాటలు మనకు ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంటాయి.
అలా హీరోగా, క్యారక్టర్ ఆర్టిస్ట్‌గానూ కొన్ని సినిమాలలో నటించిన రాజా.. ఆ తర్వాత గ్రానైట్ బిజినెస్ అంటూ బిజీ అయిపోయి.. సినిమాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. ఈ మధ్యనే మళ్లీ ఆయన ముఖానికి రంగేసుకున్నారు. ఎన్టీఆర్ బయోపిక్‌గా బాలయ్య, క్రిష్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు’ చిత్రాలలో ఎన్టీఆర్ సోదరుడైన త్రివిక్రమరావు పాత్రలో కనిపించారు.
ఆ సినిమా తర్వాత మళ్లీ ఆయన దర్శనం లేదు. మళ్లీ ఇన్నాళ్లకి.. దర్శకుడు బోయపాటి పుణ్యమా అని వెండి తెరపై మెరవబోతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించే సినిమాలలో ఎవరో ఒకరు సీనియర్ నటీమణికి ఛాన్స్ ఉన్నట్లే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చే సినిమాలలో కూడా ఎవరో ఒకరు సీనియర్ నటుడో, నటీమణో ఉంటూనే ఉంటారు. ఇదొక సెంటిమెంట్‌గా బోయపాటి భావిస్తుంటారు.
వాణి విశ్వనాధ్, జగపతిబాబు, శ్రీకాంత్, సుమన్ వంటి వారంతా బోయపాటి సినిమాలతో పునర్జన్మను పొందిన వారే. ఇప్పుడీ కోటాలోకి దగ్గుబాటి రాజా వచ్చి చేరారు. వాస్తవానికి దగ్గుబాటి రాజా తన కెరీర్‌లో సీరియస్ రోల్ చేసిన దాఖలాలు లేవు. దగ్గుబాటి రామానాయుడు కుటుంబం నుంచి వచ్చిన మొదటి హీరో ఈ రాజానే. అయినప్పటికీ కెరీర్ నిదానంగానే సాగింది. అటు తమిళ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించినప్పటికీ తెలుగులో ఎందుకనో గుర్తింపు పొందలేక పోయారు.
కాగా ఆయనిప్పుడు ఓ సీరియస్ రోల్‌లో నటిస్తూ.. రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇంతకీ ఆ సినిమా పేరు ఏమిటని అనుకుంటున్నారా? ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, టాలీవుడ్ క్రష్ శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న ‘స్కంద’ చిత్రంతో దగ్గుబాటి రాజా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఓ పవర్ ఫుల్ డైలాగ్ చెబుతూ.. దగ్గుబాటి రాజా మీసం మెలేస్తున్నాడు. మరీ మీసం మెలేసీ మరీ రీ ఎంట్రీ ఇస్తున్న ఈ నటుడు.. ఇప్పుడైనా నిలబడతాడా? లేదంటే ఏదో టైమ్ పాస్ కోసం చేసినట్లుగా అప్పుడప్పుడు ఇలా కనిపించే ప్రోగ్రామ్ ఏమైనా పెట్టుకున్నాడా? అనేదే తెలియాల్సి ఉంది.
ట్రైలర్ చూస్తుంటే ఇందులో హీరో రామ్‌కి తండ్రిగా చేసినట్లుగా అర్థమవుతుంది. సినిమా సక్సెస్ అయి, దగ్గుబాటి రాజా పాత్రకు పేరొస్తే మాత్రం.. ఇలాంటి తండ్రి అవకాశాలు ఆయనకు మరిన్ని వచ్చే అవకాశం ఉంది. ఏమో బోయపాటి ఎలా ప్లాన్ చేశాడో? అలాగే దగ్గుబాటి రాజా మనసులో ఏముందో? అప్పుడప్పుడు అలా వచ్చి వెళ్లిపోకుండా.. నిలకడగా నిలిచే ప్లాన్ చేసుకుంటే మాత్రం.. దగ్గుబాటి రాజాని మరికొన్ని సినిమాలలో చూసే అవకాశం అయితే లేకపోలేదు. అది విషయం.