24-03-2023 శుక్ర‌వారం మీ రాశి ఫ‌లాలు.. ఈ రాశి వారు ఉల్లాసంగా గడుపుతారు

మేష రాశి: క్రీడాకారులు విజయం సాధిస్తారు. ప్రయత్నకార్యములు సిద్ధిస్తాయి. మీ చిరకాల కోరికలు నెరవేరుతాయి. దూర ప్రాంతాల నుంచి శుఖ సమాచారం అందుతుంది. స్థిరాస్థుల కొనుగోలు ప్రయత్నాలకు అనుకూలము. వృషభ రాశి: వివాహ ప్రయత్నాలు సిద్ధిస్తాయి. కుటుంబముతో ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు. ప్రముఖ వ్యక్తులతో కలయిక లాభిస్తుంది. ఆధ్యాత్మకంగా నూతన విషయాలను తెలుసుకుంటారు. మిథున రాశి: వివాదాల మూలకంగా మానసిక ఆందోళన క‌లుగవచ్చును. శిరో బాధ‌లు కలుగవచ్చును. ఇష్టములేని పనులను నిర్వహించవలసి వస్తుంది. వాత బాధలు కలుగవచ్చును. […]

24-03-2023 శుక్ర‌వారం మీ రాశి ఫ‌లాలు.. ఈ రాశి వారు ఉల్లాసంగా గడుపుతారు

మేష రాశి: క్రీడాకారులు విజయం సాధిస్తారు. ప్రయత్నకార్యములు సిద్ధిస్తాయి. మీ చిరకాల కోరికలు నెరవేరుతాయి. దూర ప్రాంతాల నుంచి శుఖ సమాచారం అందుతుంది. స్థిరాస్థుల కొనుగోలు ప్రయత్నాలకు అనుకూలము.

వృషభ రాశి: వివాహ ప్రయత్నాలు సిద్ధిస్తాయి. కుటుంబముతో ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు. ప్రముఖ వ్యక్తులతో కలయిక లాభిస్తుంది. ఆధ్యాత్మకంగా నూతన విషయాలను తెలుసుకుంటారు.

మిథున రాశి: వివాదాల మూలకంగా మానసిక ఆందోళన క‌లుగవచ్చును. శిరో బాధ‌లు కలుగవచ్చును. ఇష్టములేని పనులను నిర్వహించవలసి వస్తుంది. వాత బాధలు కలుగవచ్చును.

కర్కాటక రాశి: జీవిత భాగస్వామితో ఆనందంగా గడపుతారు. దూర ప్రాంతముల నుంచి శుభవార్తలను వింటారు. శరీర సౌఖ్యము ఉంటుంది. పట్టుదలతో కార్య సాధన చేస్తారు. ధనప్రాప్తి ఉంటుంది.

సింహ రాశి: భగవదారాధన సంతృప్తినిస్తుంది. చెప్పడు మాటలకు దూరంగా ఉండడం వలన మనఃశాంతి లభిస్తుంది. పరోపకారము చేస్తారు. నష్ట ధన ప్రాప్తి కలుగుతుంది. కీర్తి ప్రతష్ఠలు కలుగుతాయి.

కన్యా రాశి: జీవిత భాగస్వామిపై అపార్థాలు తొలగిపోతాయి. పండితులు, కవులు నూతన రచనలు చేయడానికి సంకల్పిస్తారు. బంధుమిత్రుల కలయికలు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. సోమరితనం వదలి పెట్టండి పనులు పూర్తవుతాయి.

తులా రాశి: అజ్ఞాతులతో విరోధము కలుగవచ్చును. తల్లి దండ్రుల అనారోగ్యము కారణంగా అశాంతి కలుగవచ్చును. మనశ్చాంచల్యముతో పనులు పూర్తి కావు. బంధుమిత్రులకు విరోధములు కలుగవచ్చును.

వృశ్చిక రాశి: అధిక సంచారము వలన అలసట ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. చక్కని మాట తీరుతో పనులు పూర్తి చేసుకుంటారు. అత్మస్థైర్యము బలాన్నిస్తుంది. సంతానమూలక ఆనందం కలుగుతుంది.

ధనుస్సు రాశి: క్ర‌య విక్ర‌యముల మూలకంగా లాభం కలుగుతుంది. వివాదాలు పరిష్కరించుకుంటారు. సినీ రంగంలోని వారికి సన్మాన గౌరవం లభిస్తుంది. దైవ కార్యక్రమాలలో ముందుంటారు.

మకర రాశి: కుటుంబ మూలకంగా సౌఖ్యం లభిస్తుంది. పొగుట్టుకున్న వస్తువులు తిరిగి లభించే అవకాశముంది. భోజన సౌఖ్యం లభిస్తుంది. గౌరవ మర్యాదలు లభిస్తాయి. స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు.

కుంభ రాశి: ఉద్యోగార్థులు శుభాసమాచారాన్ని అందుకుంటారు. ప్రయాణములు చేయవలసి రావచ్చును. బంధుమిత్రులతో విభేదాలు రావచ్చును. ధన వ్యయము పెరుగుతుంది.

మీన రాశి: వివాహ ప్రయత్నములు పెరుగుతాయి. కొత్త వ్యక్తులతో కలయిక లాభం చేకూర్చుతుంది. సంతాన మూలకంగా ఆనందం లభిస్తుంది. ధనప్రాప్తి కలుగుతుంది. సోదర వర్గముతో ఉల్లాసంగా గడుపుతారు.

– తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
కూకట్‌పల్లి, హైదరాబాద్
ఫోన్‌ నంబర్‌ : +91 99490 11332.