Nallagonda | అమ్మా.. చెల్లిని అమ్మ‌కండి.. త‌ల్లి కాళ్లు ప‌ట్టుకున్న చిన్నారులు

Nallagonda | ఇది హృద‌య విదార‌క ఘ‌ట‌న‌( Heart-Wrenching ).. అమ్మా.. చెల్లిని( Younger Sister ) అమ్మకు అంటూ కాళ్ల మీద పడి ఓ ఇద్ద‌రు చిన్నారులు( Elder Sisters ) త‌ల్లిని వేడుకున్న తీరు.. అంద‌రి హృద‌యాల‌ను క‌లిచివేసింది. అయ్యా.. క‌ష్ట‌ప‌డి చెల్లిని సాదుకుందాం అని ఆ చిన్నారులు గుక్క‌ప‌ట్టి ఏడ్వ‌డం.. అంద‌రి మ‌న‌సుల‌ను హ‌త్తుకుంది.

  • By: raj |    telangana |    Published on : Oct 28, 2025 8:01 AM IST
Nallagonda | అమ్మా.. చెల్లిని అమ్మ‌కండి.. త‌ల్లి కాళ్లు ప‌ట్టుకున్న చిన్నారులు

Nallagonda | న‌ల్ల‌గొండ జిల్లా( Nallagonda District ) తిరుమ‌ల‌గిరి సాగ‌ర్ మండ‌లం ప‌రిధిలోని ఎల్లాపురం తండాకు చెందిన బాబు, కొర్ర పార్వ‌తీకి కొన్నేండ్ల క్రితం వివాహ‌మైంది. వీరికి న‌లుగురు ఆడ పిల్ల‌లు ఉన్నారు. ముందే పేద‌రికం.. ఈ న‌లుగురి ఆడ‌పిల్ల‌ల‌ను( Girls ) సాదేందుకు ఆ దంప‌తుల‌కు క‌ష్ట‌మొచ్చింది. ఆర్థిక ఇబ్బందుల‌తో( Financial Problems ) స‌త‌మ‌త‌మ‌వుతున్న బాబు, పార్వ‌తీ.. ఓ చిన్నారిని విక్ర‌యించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఈ క్ర‌మంలో ఓ ఆడ‌బిడ్డ‌ను( Younger Sister ) ద‌ళారుల ద్వారా రూ. 3 ల‌క్ష‌ల‌కు గుంటూరు జిల్లాకు చెందిన దంప‌తుల‌కు అమ్మేశారు. ఈ క్రమంలో చెల్లిని అమ్మొద్దు అంటూ ఇద్ద‌రు అక్క‌లు( Elder Sisters ) వేడుకునే తీరు చూసి కుటుంబ సభ్యులు కంట‌త‌డి పెట్టారు. కూలీనాలి చేసుకుని బ‌తుకుదాం అని ఆ పిల్ల‌లు త‌ల్లిదండ్రులను వేడుకున్న తీరు అంద‌రికి క‌న్నీళ్లు తెప్పిస్తుంది.

నల్గొండ జిల్లాలో పేద, గిరిజన తండాలను టార్గెట్ చేసుకుని ద‌ళారులు శిశు విక్రయాలకు పాల్పడుతున్న తేలింది. ఈ దందా గ‌త కొంత‌కాలంగా కొన‌సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే చెల్లిని అమ్మొద్దు అంటూ చిన్నారులు వేడుకున్న సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.