Cyclone Montha Effect | ‘మొంథా’ ఎఫెక్ట్.. రాష్ట్రంలో ఇవాళ‌, రేపు భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు..!

Cyclone Montha Effect | మొంథా తుపాను ఎఫెక్ట్( Cyclone Montha Effect ) తెలంగాణ‌( Telangana )పై కూడా ప్ర‌భావం చూపుతుంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం)( IMD Hyderabad ) ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లో మంగ‌ళ‌, బుధ‌వారాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు( Heavy Rains ) కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది.

  • By: raj |    telangana |    Published on : Oct 28, 2025 7:00 AM IST
Cyclone Montha Effect | ‘మొంథా’ ఎఫెక్ట్.. రాష్ట్రంలో ఇవాళ‌, రేపు భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు..!

Cyclone Montha Effect | హైద‌రాబాద్ : మొంథా తుపాను ఎఫెక్ట్( Cyclone Montha Effect )ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాదు.. పొరుగున ఉన్న తెలంగాణ‌( Telangana )పై కూడా ప్ర‌భావం చూపుతుంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం)( IMD Hyderabad ) ప్ర‌క‌టించింది. ఈ తుపాను ఇవాళ ఉద‌యం తీవ్ర తుపానుగా మార‌నుంది. ఇవాళ సాయంత్రానికి లేదా రాత్రి వ‌ర‌కు కాకినాడ ప్రాంతంలో తీరాన్ని దాటే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ( Weather ) శాఖ తెలిపింది. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లో మంగ‌ళ‌, బుధ‌వారాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు( Heavy Rains ) కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. ఈ స‌మ‌యంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది.

మూడు జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్

మంగ‌ళ‌వారం రాత్రి నుంచి బుధ‌వారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు రాష్ట్రంలోని ఈశాన్య జిల్లాల‌కు మొంథా తుపాను ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంద‌ని అధికారులు పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, ములుగు జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేశారు. ఈ మూడు జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో 19 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

మిగిలిన తెలంగాణ ఈశాన్య జిల్లాలన్నింటికి ఎల్లో హెచ్చరికను జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్​ రావు వెల్లడించారు. దీంతో పాటు అరేబియా సముద్రం నుంచి ప్రవాహం వచ్చే అవకాశం ఉందని, పశ్చిమ వైపు ఉన్న నిర్మల్​, నిజామాబాద్​, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు సైతం మంగళవారం ఎల్లో అలర్ట్​ ఉండనున్నట్లు స్పష్టం చేశారు. బుధవారం ఆదిలాబాద్​, కుమురంభీం, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​, మిగిలిన నాలుగు నుంచి ఐదు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం వరకు తుపాను క్రమంగా ఉత్తరం దిశగా ప్రయాణించడంతో క్రమంగా దాని ప్రభావం తగ్గిపోతుందని చెప్పారు.