KCR | మరికాసేపట్లో హరీశ్‌రావు ఇంటికి కేసీఆర్.. బావ పార్థివదేహానికి నివాళులర్పించనున్న బీఆర్ఎస్ చీఫ్
KCR | మరికాసేపట్లో హరీశ్‌రావు( Harish Rao ) ఇంటికి బీఆర్ఎస్ అధినే కేసీఆర్( KCR ) వెళ్లనున్నారు. హరీశ్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ( Thanneeru Satyanarayana ) పార్థివదేహానికి కేసీఆర్ నివాళులర్పించనున్నారు.
KCR | హైదరాబాద్ : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు( Harish Rao ) తండ్రి తన్నీరు సత్యనారాయణ( Thanneeru Satyanarayana ) మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరికాసేపట్లో హరీశ్‌రావు ఇంటికి బీఆర్ఎస్ అధినే కేసీఆర్( KCR ) వెళ్లనున్నారు. సత్యనారాయణ పార్థివదేహానికి కేసీఆర్ నివాళులర్పించనున్నారు.
తన బావ (కేసీఆర్ 7వ సోదరి, అక్క లక్ష్మీ భర్త ), మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత తన్నీరు హరీశ్ రావు తండ్రి, తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తన బావతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకుని, వారి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. సత్యనారాయణ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
సమాచారం తెలిసిన వెంటనే హరీశ్‌రావుకు కేసీఆర్ ఫోన్ చేసి పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరికాసేపట్లో వారి నివాసానికి వెళ్లి, దివంగత సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించి, తన సోదరిని, కుటుంబ సభ్యులను కేసీఆర్ ఓదార్చనున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram