Project K | ప్రాజెక్ట్‌ కే నుంచి దీపికా లుక్‌ రిలీజ్‌.. సినిమాపై భారీగా పెరుగుతున్న అంచనాలు..!

Project K | యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం ప్రాజెక్ట్‌ కే. ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతున్నది. సినిమాలో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. దీపికా పదుకొణే లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. లుక్‌పై మంచి రెస్పాన్స్‌ వస్తున్నది. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. బిగ్‌బీ అమితాబచ్చన్‌, విశ్వనటుడు కమల్‌ హసన్‌తో […]

Project K | ప్రాజెక్ట్‌ కే నుంచి దీపికా లుక్‌ రిలీజ్‌.. సినిమాపై భారీగా పెరుగుతున్న అంచనాలు..!

Project K | యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం ప్రాజెక్ట్‌ కే. ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతున్నది. సినిమాలో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. దీపికా పదుకొణే లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. లుక్‌పై మంచి రెస్పాన్స్‌ వస్తున్నది. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. బిగ్‌బీ అమితాబచ్చన్‌, విశ్వనటుడు కమల్‌ హసన్‌తో పాటు బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ కీలకపాత్రలు పోషిస్తుండగా.. ఈ సినిమాకు సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు.

ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఇందులో హీరోయిన్ దీపికాను కాపాడే సూపర్ హీరోస్ పాత్రల్లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ కనిపించనున్నట్టు తెలుస్తున్నది. కథ అంతా దీపిక చుట్టూనే ఉంటుందని టాక్‌. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే, సినిమా అనుకున్న సమయానికి విడుదల చేయకపోవచ్చని, వాయిదా పడే అవకాశాలున్నాయని సమాచారం. ప్రస్తుతం చిత్రం షూటింగ్‌లో కమల్ హాసన్‌ను జాయిన్ కానున్నారు. ఆయనకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరణ పూర్తయితే దాదాపు షూటింగ్‌ కంప్లీట్‌ అయినట్లే. ఆ తర్వాత పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ తదితర పనులు ఉంటాయి. ఈ క్రమంలోనే సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్‌ ఉన్నట్లు తెలుస్తున్నది.

సంక్రాంతికి రిలీజ్ చేస్తే.. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ సమస్య అవకాశాలుంటాయని, సమ్మర్‌లో అయితో డేట్స్‌ విషయంలో ఎలాంటి సమస్య ఉండదని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా.. సమాచారం మేరకు ప్రాజెక్ట్‌- కే టైటిల్‌ పేరు ముందుగా ప్రాజెక్ట్‌ కర్ణ, ప్రాజెక్ట్‌ కల్కి పేర్లు వినిపించగా.. తాజాగా ప్రాజెక్ట్‌- కాలచక్ర పేరును ఫైనల్‌ చేసినట్లు తెలుస్తున్నది. ఈ విషయాన్ని ఈనెల 20న అమెరికాలోని శాండియాగోలోని కామిన్‌కాన్‌లో టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. భారత కాలమానం ప్రకారం 21న ఈ సినిమా అధికారిక టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రాజెక్ట్ కే ప్రభాస్‌ మహావిష్ణు అవతారంలో కనిపించనున్నట్లు సమాచారం.