Deepinder Goyal | రెండో పెళ్లి చేసుకున్న జొమాటో సీఈవో.. మెక్సికో వ్యాపారవేత్తతో వివాహం..!
Deepinder Goyal : జొమాటో వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ (Deepinder Goyal).. మెక్సికోకు చెందిన అలనాటి మోడల్, ప్రస్తుత వ్యాపారవేత్త గ్రేసియా మునోజ్ (Grecia Munoz) ను వివాహం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఆయనకు ఇదివరకే పెళ్లయ్యింది. ఇది రెండో వివాహం. గతంలో కంచన్ జోషి అనే మహిళను దీపిందర్ వివాహం చేసుకున్నారు.
గ్రేసియా మునోజ్ భారత్‌లో విలాసవంతమైన వినియోగ ఉత్పత్తుల తయారీ విభాగంలో సొంతంగా అంకుర సంస్థను స్థాపించి నిర్వహిస్తున్నారు. వ్యాపార రంగంలో అడుగుపెట్టక ముందు ఆమె మోడల్‌గా రాణించారు. మెట్రోపాలిటన్ ఫ్యాషన్ వీక్- 2022 విజేతగా గ్రేసియా నిలిచారు.
దీపిందర్ గోయల్, గ్రేసియా మునోజ్‌లో ఇప్పుడిప్పుడ జరగలేదట. రెండు నెలల క్రితమే వారిద్దరూ వివాహం చేసుకున్నారట. ఓ జాతీయ మీడియా సంస్థ ద్వారా ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, గ్రేసియా తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో ‘మెక్సికోలో పుట్టాను.. ఇప్పుడు భారత్ నా నివాసం’ అని రాసుకుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram