Uttarakhand | ఉత్త‌రాఖండ్‌లో భారీ వ‌ర్షాలు.. కుప్ప‌కూలిన ఢిపెన్స్ కాలేజీ భ‌వ‌నం

Uttarakhand | కూలిన కొంచ‌రియ‌లు.. మ‌ట్టిదిబ్బ‌ల కింద వాహ‌నాలు రెండు రాష్ట్రాల్లో అనేక జిల్లాల‌కు ఐఎండీ రెడ్ అల‌ర్ట్‌ వాన‌ల‌కు కూలిన డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజీ భవనం ఉత్త‌రాఖండ్‌లో వ‌ర్షాల‌కు ఇప్ప‌టివ‌ర‌కు 52 మంది మృతి హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 257 మంది దుర్మ‌ర‌ణం ఉత్త‌రాఖండ్ 650 కోట్ల నష్టం, హిమాచ‌ల్‌లో రూ.7 వేల కోట్ల న‌ష్టం విధాత‌: హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కుండ‌పోత వాన‌ల‌కు ఏడుగురు దుర్మ‌ర‌ణం చెందారు. సోల‌న్ జిల్లాలో ఒక్క‌రాత్రి కుంభవృష్టిగా కురిసిన వాన బీభ‌త్సం […]

  • By: raj    latest    Aug 14, 2023 6:13 AM IST
Uttarakhand | ఉత్త‌రాఖండ్‌లో భారీ వ‌ర్షాలు.. కుప్ప‌కూలిన ఢిపెన్స్ కాలేజీ భ‌వ‌నం

Uttarakhand |

  • కూలిన కొంచ‌రియ‌లు.. మ‌ట్టిదిబ్బ‌ల కింద వాహ‌నాలు
  • రెండు రాష్ట్రాల్లో అనేక జిల్లాల‌కు ఐఎండీ రెడ్ అల‌ర్ట్‌
  • వాన‌ల‌కు కూలిన డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజీ భవనం
  • ఉత్త‌రాఖండ్‌లో వ‌ర్షాల‌కు ఇప్ప‌టివ‌ర‌కు 52 మంది మృతి
  • హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 257 మంది దుర్మ‌ర‌ణం
  • ఉత్త‌రాఖండ్ 650 కోట్ల నష్టం, హిమాచ‌ల్‌లో రూ.7 వేల కోట్ల న‌ష్టం

విధాత‌: హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కుండ‌పోత వాన‌ల‌కు ఏడుగురు దుర్మ‌ర‌ణం చెందారు. సోల‌న్ జిల్లాలో ఒక్క‌రాత్రి కుంభవృష్టిగా కురిసిన వాన బీభ‌త్సం సృష్టించింది. కందఘాట్ సబ్ డివిజన్‌లోని జాడోన్ గ్రామంలో సోమవారం ఉదయం కుండ‌పోత వాన కార‌ణంగా ఏడుగురు మరణించారు. వ‌ర‌ద‌ల్లో రెండు ఇండ్లు, ఒక గోశాల కొట్టుకుపోయాయి.

ఉత్తరాఖండ్‌లోని ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా రిషికేశ్ జలదిగ్బంధంలో చిక్కుకున్న‌ది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లోని ప‌లు జిల్లాల‌కు ఆదివార‌మే భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అల‌ర్ట్ హెచ్చ‌రిక జారీచేసింది. ఏడుగురు మృతిచెందిన ఘ‌ట‌న‌పై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖూ సోమవారం ట్విట్ట‌ర్‌లో సంతాపం ప్ర‌క‌టించారు.

ఆరు జిల్లాల్లో కుండ‌పోత వాన‌లు

హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్, చంబా, హమీర్‌పూర్, కాంగ్రా, కులు, మండి, సిమ్లా, సిర్మౌర్, సోలన్, ఉనా, కిన్నౌర్, లాహౌల్, స్పితి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న‌దని
ఐఎండీ సిమ్లా పేర్కొన్న‌ది.

ఉత్తరాఖండ్‌లోని మాల్‌దేవ్తాలోని డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజీ భవనం సోమవారం కుప్పకూలింది. ఆదివారం నుంచి సోమ‌వారం ఉద‌యం వ‌ర‌కు ఉత్తరాఖండ్‌లోని ఆరు జిల్లాల్లో కుండ‌పోత వాన‌లు ప‌డ్డాయి. భారీ వర్షాల కారణంగా రిషికేశ్‌తోసహా ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఏర్పడింది.

హిమాచల్ ప్రదేశ్‌లో 24 గంట‌లుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిరిప‌డ్డాయి. సిమ్లా-చండీగఢ్ రహదారి చాలాచోట్ల మూసుకుపోయింది. అనేక బ‌స్సులు, లారీలు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయాయి. కొన్ని వాహ‌నాలు మ‌ట్టిదిబ్బ‌ల కింద కూరుకుపోయాయి.
ఉత్త‌రాఖండ్‌లో వ‌ర్షాల‌కు 52 మంది మృతి.

ఉత్తరాఖండ్‌లో వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య 52కి చేరుకున్న‌ది. మరో 37 మంది గాయపడినట్టు ఒక అధికారి తెలిపారు. వర్షాల కారణంగా అనేక చోట్ల కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు కూడా సంభవించాయి.

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో బద్రీనాథ్ హైవేపై మాయాపూర్‌లోని కొండపై నుంచి వస్తున్న పలు వాహనాలు శిథిలాల కింద కూరుకుపోయాయి. అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం వివ‌రాలు అంద‌లేద‌ని అధికారులు వెల్ల‌డించారు.

ఉత్తరాఖండ్ 650 కోట్ల నష్టం

ఈ సంవత్సరం వర్షాకాలంలో కురిసిన వాన‌ల కార‌ణంగా ఉత్త‌రాఖండ్‌లో రూ.650 కోట్ల ఆస్తి న‌ష్టం సంభ‌వించిన‌ట్టు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన బృందం (SDRF) తెలిపింది. ఎస్డీఆర్ఎఫ్ జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (NDRF) బృందాలు వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో రెండు హెలికాప్టర్లను కూడా సిద్ధంగా ఉంచారు. భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌ మండి జిల్లాలోని బాల్ లోయలో వరదలు బీభ‌త్స సృష్టిస్తున్నాయి. పలువురు పర్యాటకులు చిక్కుకుపోయారు.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో 7 వేల కోట్ల న‌ష్టం

భారీ వ‌ర్షాల‌కు ఉత్త‌రాఖండ్ కంటే హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రామే ఎక్క‌వ‌గా న‌ష్ట‌పోయింది. ఈ వాన‌కాలం సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 257 మంది దుర్మ‌ర‌ణం చెందారు. సుమారు 7 వేల కోట్ల వ‌ర‌కు ఆస్తిన‌ష్టం సంభ‌వించింది. ఈ విష‌యాన్ని అధికారులు సోమ‌వారం వెల్ల‌డించారు. 257 మందిలో 66 మంది కొండచరియలు విరిగిపడటంతో పాటు వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదాలు లేదా ఇతర కారణాల వల్ల 191 మంది ప్రాణాలు కోల్పోయారు. 32 మంది గల్లంతయ్యారని, 290 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.