ఊటీలో నిర్మాణంలో ఉన్న భ‌వ‌నం కూలి ఆరుగురు మృతి

త‌మిళ‌నాడులోని ఊటీ స‌మీపంలో బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. లోవ్‌డాలే వ‌ద్ద నిర్మాణంలో ఉన్న ఓ భ‌వ‌నం కూలిపోయింది

  • By: Somu    latest    Feb 07, 2024 10:30 AM IST
ఊటీలో నిర్మాణంలో ఉన్న భ‌వ‌నం కూలి ఆరుగురు మృతి

చెన్నై : త‌మిళ‌నాడులోని ఊటీ స‌మీపంలో బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. లోవ్‌డాలే వ‌ద్ద నిర్మాణంలో ఉన్న ఓ భ‌వ‌నం కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు అక్క‌డికక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.


స‌మాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘ‌టనాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు. జేసీబీ స‌హాయంతో శిథిలాల‌ను తొల‌గిస్తున్నారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, క్ష‌త‌గాత్రుల‌ను స‌మీపంలోని ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. శిథిలాల కింద ప‌ల‌వురు చిక్కుకున్న‌ట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబ స‌భ్యులు క‌న్నీరుమున్నీరు అవుతున్నారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని ఉన్న‌తాధికారులు ఆదేశించారు. చికిత్స పొందుతున్న వారిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం.