Viral Video | మ‌హిళా ఎస్ఐని చిత‌క‌బాదిన భ‌ర్త‌..

Viral Video | ఢిల్లీకి చెందిన ఓ మ‌హిళా ఎస్ఐ(స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌)ని భ‌ర్త చిత‌క‌బాదాడు. అనంత‌రం ఆమె త‌ల్లిపై కూడా దాడి చేయ‌బోయాడు. ఈ దృశ్యాలు ఎస్ఐ ఇంటి వ‌ద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ఢిల్లీలోని ద్వారకాకు చెందిన దోలి తేవాతియా వృత్తిరీత్యా స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌. ఆమెకు అడ్వ‌కేట్ త‌రుణ్ ద‌బాస్‌తో కొన్నేండ్ల క్రితం వివాహం జ‌రిగింది. అయితే ఎస్ఐ దోలి ప్ర‌స్తుతం మెట‌ర్నిటీ లీవ్‌లో ఉంది. […]

Viral Video | మ‌హిళా ఎస్ఐని చిత‌క‌బాదిన భ‌ర్త‌..

Viral Video | ఢిల్లీకి చెందిన ఓ మ‌హిళా ఎస్ఐ(స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌)ని భ‌ర్త చిత‌క‌బాదాడు. అనంత‌రం ఆమె త‌ల్లిపై కూడా దాడి చేయ‌బోయాడు. ఈ దృశ్యాలు ఎస్ఐ ఇంటి వ‌ద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

ఢిల్లీలోని ద్వారకాకు చెందిన దోలి తేవాతియా వృత్తిరీత్యా స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌. ఆమెకు అడ్వ‌కేట్ త‌రుణ్ ద‌బాస్‌తో కొన్నేండ్ల క్రితం వివాహం జ‌రిగింది. అయితే ఎస్ఐ దోలి ప్ర‌స్తుతం మెట‌ర్నిటీ లీవ్‌లో ఉంది. త‌న త‌ల్లి వ‌ద్ద ఉన్న దోలికి.. భ‌ర్త‌తో గ‌త కొద్ది రోజుల నుంచి గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. సోమ‌వారం భ‌ర్త త‌రుణ్ దోలి ఇంటికి వ‌చ్చాడు. ఈ క్ర‌మంలో ఇరువురి మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భ‌ర్త కారులో తిరిగి వెళ్తున్న స‌మ‌యంలో దోలి స‌హ‌నం కోల్పోయి కారు మిర్ర‌ర్‌ను విర‌గ్గొట్టింది. దీంతో భ‌ర్త కారు దిగి దోలిని కింద ప‌డేశాడు. అడ్డుకోబోయిన దోలి త‌ల్లిపై కూడా అత‌ను దాడి చేసేందుకు య‌త్నించాడు. ఈ దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

ఈ దృశ్యాల‌ను దోలి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేసింది. నేను ఢిల్లీ పోలీసు విభాగంలో స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌ను. ప్ర‌స్తుతం మెట‌ర్నిటీ లీవ్‌లో ఉన్నాను. నా భ‌ర్త అడ్వ‌కేట్ త‌రుణ్‌తో నిత్యం గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఇవాళ ప‌ట్ట‌ప‌గ‌లే నాపై దాడి చేశాడు. త‌రుణ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.