Delhi | అందరు చూస్తుండగానే 16 ఏండ్ల బాలిక‌పై 22 క‌త్తిపోట్లు.. ప్రియుడు అరెస్ట్

Delhi | దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రంలో ఘోరం జ‌రిగింది. ఓ ప్రేమికుడు త‌న ప్రియురాలిపై విచ‌క్ష‌ణా ర‌హితంగా క‌త్తితో దాడి చేశాడు. అంద‌రూ చూస్తుండ‌గానే ఆ బాలిక‌పై క‌త్తితో 22 సార్లు పొడిచి చంపాడు. చివ‌ర‌కు ఆ క‌త్తి ఆమె పుర్రెలో చిక్కుకుపోయింది. అనంత‌రం ఓ బండ‌రాయిని తీసుకొని ఆమె త‌ల‌పై ఎత్తేశాడు. ఆ త‌ర్వాత అక్క‌డ్నుంచి పారిపోయాడు ప్రియుడు. వివ‌రాల్లోకి వెళ్తే.. ఏసీ, ఫ్రిడ్జ్ రిపేర్లు చేసే సాహిల్‌(20)కు 16 ఏండ్ల‌ బాలిక ప‌రిచ‌య‌మైంది. […]

Delhi | అందరు చూస్తుండగానే 16 ఏండ్ల బాలిక‌పై 22 క‌త్తిపోట్లు.. ప్రియుడు అరెస్ట్

Delhi | దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రంలో ఘోరం జ‌రిగింది. ఓ ప్రేమికుడు త‌న ప్రియురాలిపై విచ‌క్ష‌ణా ర‌హితంగా క‌త్తితో దాడి చేశాడు. అంద‌రూ చూస్తుండ‌గానే ఆ బాలిక‌పై క‌త్తితో 22 సార్లు పొడిచి చంపాడు. చివ‌ర‌కు ఆ క‌త్తి ఆమె పుర్రెలో చిక్కుకుపోయింది. అనంత‌రం ఓ బండ‌రాయిని తీసుకొని ఆమె త‌ల‌పై ఎత్తేశాడు. ఆ త‌ర్వాత అక్క‌డ్నుంచి పారిపోయాడు ప్రియుడు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఏసీ, ఫ్రిడ్జ్ రిపేర్లు చేసే సాహిల్‌(20)కు 16 ఏండ్ల‌ బాలిక ప‌రిచ‌య‌మైంది. కొన్నాళ్ల‌కు ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించింది. అయితే నిన్న సాయంత్రం ఆమె త‌న ఫ్రెండ్ కుమారుడి బ‌ర్త్ డే వేడుక‌లకు వెళ్తుండ‌గా ఢిల్లీలోని రోహిణి షాబాద్ డెయిరీ వ‌ద్ద అడ్డుకున్నాడు. బ‌ర్త్ డేకు వెళ్లే విష‌యంలో ఆమెకు, సాహిల్‌కు మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ క్ర‌మంలోనే ఆమెపై క‌త్తితో దాడి చేశాడు. 22 సార్లు పొడిచి చంపాడు. బాలిక పుర్రెలో క‌త్తి ఇరుక్కుపోవ‌డంతో.. త‌ల‌పై బండ‌రాయితో మోది హ‌త్య చేశాడు. అంద‌రూ చూస్తుండ‌గా ఈ దారుణానికి ఒడిగట్టిన సాహిల్‌ను ఎవ‌రూ అడ్డుకోలేక‌పోయారు. బాలికను క‌త్తితో పొడిచి చంపిన దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడు సాహిల్‌ను ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బులంద్‌షార్‌లో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని క‌ఠినంగా శిక్షిస్తామ‌ని పోలీసులు తెలిపారు. బాలిక హ‌త్య‌ను ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. సాహిల్ లాంటి వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌ను ఆదేశించారు సీఎం.