Dharani Applications | ధరణి దరఖాస్తులు 2,67,000.. CCLAలో గుట్టలు గుట్టలుగా దరఖాస్తులు: నర్సింహారెడ్డి
Dharani Applications పరిష్కారంపై దృష్టి సారించని సర్కారు ధరణి భూ సమస్యల వేదిక కన్వీనర్ మన్నెం నర్సింహారెడ్డి విధాత: ధరణి దరఖాస్తులు సీసీఎల్‌ఏలో గుట్టలు గుట్టలుగా పేరుకు పోతున్నాయని, వాటిని పరిష్కరించే నాధుడే కరువయ్యాడని ధరణి భూ సమస్యల వేధిక కన్వీనర్ మన్నెం నర్సింహారెడ్డి ఆరోపించారు. ధరణి ఫోర్టల్‌లో టీఎం 33 ఇప్పటి వరకు 2,67,000 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ 15 వరకే 97,000 వేల అప్లికేషన్స్ వచ్చాయన్నారు. ఇంత తీవ్రంగా […]

Dharani Applications
- పరిష్కారంపై దృష్టి సారించని సర్కారు
- ధరణి భూ సమస్యల వేదిక కన్వీనర్ మన్నెం నర్సింహారెడ్డి
విధాత: ధరణి దరఖాస్తులు సీసీఎల్‌ఏలో గుట్టలు గుట్టలుగా పేరుకు పోతున్నాయని, వాటిని పరిష్కరించే నాధుడే కరువయ్యాడని ధరణి భూ సమస్యల వేధిక కన్వీనర్ మన్నెం నర్సింహారెడ్డి ఆరోపించారు. ధరణి ఫోర్టల్‌లో టీఎం 33 ఇప్పటి వరకు 2,67,000 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ 15 వరకే 97,000 వేల అప్లికేషన్స్ వచ్చాయన్నారు. ఇంత తీవ్రంగా ధరణి సమస్యలు ఉంటే సమస్యలే లేవని ప్రభుత్వం చెబుతోందన్నారు.
ధరణిలో సమస్యలన్నీ పరిష్కారమైతే ఇన్ని అప్లికేషన్లు ఎందుకు వస్తున్నాయని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ధరణిలో దరఖాస్తు చేసిన వెంటనే కలెక్టర్‌కు ఆతరువాత ఎమ్మార్‌ఓకు అక్కడి నుంచి మళ్లీ కలెక్టర్‌కు అక్కడి నుంచి సీసీఎల్‌ఏకు నెలల తరబడి ఫైల్‌ను తిప్పుతున్నారన్నారు. ఒక్క గుంట భూమికి కూడా ఇన్ని ఆఫీసులలో తిరిగి క్లియర్ కావాల్సి ఉంటుందన్నారు.
ధరణి పోర్టల్ సరళతరమైతే ఒక్క సమస్య పరిష్కారానికి ఇంత జఠిలం ఎందుకు అవుతుందని ప్రశ్నించారు. సమస్యలన్నీ పరిష్కరిస్తే, ధరణిలో భూమి సమస్యలు ఏవీ లేకుంటే ప్రతి రోజు సీసీఎల్‌ఏ నవీన్ మిట్టల్‌ను కలువడానికి వందల కొద్ది రైతులు ఎందుకు కార్యాలయానికి వచ్చిపడిగాపులు కాస్తున్నారని, అయినా ప్రభుత్వానికి జ్ఞానం లేదన్నారు . పైగా సమస్యలు ఏవీ లేవన్నట్టు సీఎం కేసీఆర్ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారన్నారు.
సీసీఎల్‌ఏ నవీన్ మిట్టల్ దరఖాస్తు దారులను కలవకుండానే వెళ్ళిపోతున్న పరిస్థితి ఉందని, ఇలా అయితే సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయన్నారు. వాస్తవంగా సమస్యలు పరిష్కరించాలని ఉన్నా ఇన్ని లక్షల ఫైళ్లు చూడడం సాధ్యమా అని అడిగారు. ఏ మాత్రం అసలు ప్రభుత్వానికి బుద్ధుందా? మాట్లాడే వారికి విజ్ఞత ఉందా? అని అడిగారు.
ఎవరైనా సమస్యల్నిపరిష్కరించడానికి డీసంట్రలైజేషన్ చేసి ఎక్కువ మంది అధికారులను పెట్టి కలెక్టర్లు, తాసీల్దార్లతో పని చేయించాలని కానీ దీనికి భిన్నంగా కలెక్టర్లు, కమిషనర్లతో చేయిస్తున్న పరిస్థితి సమస్యలు పేరుకు పోవడానికి కారణమైందన్నారు. మండల వ్యవస్థను తీసుకొచ్చి, సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం చేసేటువంటి రోజులు ఆనాడు ఉండేవనన్నారు. కిందిస్థాయిలో ఉన్న రెవెన్యూ కో కోర్టులు రద్దు చేశారని, తప్పులను సరి చేయడానికి తాసీల్దార్లకు ఉన్న పవర్‌ను తొలగించారని, అలాంటప్పుడు రైతులు ఎవరి దగ్గరకు వెళ్లాలని ప్రశ్నించారు.
సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయని అడిగారు. ఇంకెన్ని రోజులు ధరణి కష్టాలని అడిగారు. విజ్ఞత ఉన్న మేధావులంతా రైతులు పడుతున్న ఇబ్బందులని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని కోరారు. ప్రభుత్వం మెడలు వంచి గ్రామసభలు పెట్టించి సమస్యలను పరిష్కారం అయ్యే పద్ధతిలో పోరాటాలు చేయాలన్నారు.