Samantha: సమంత అంత పనిచేసిందా..!?

Samantha: సమంత అంత పనిచేసిందా..!?

Samantha: సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున మాజీ కోడలు హీరోయిన్ సమంత వ్యవహారం మరోసారి అభిమానులలో హాట్ టాపిక్ గా మారింంది. ఇందుకు ఆమె తాజాగా విడుదల చేసిన ఓ వీడియో కారణమైంది. తను సహా వ్యవస్థాపకురాలుగా ఉన్న కాస్మోటిక్ పర్సనల్ కేర్ సంస్థ “ సీక్రెట్ అల్కమిస్ట్ ” ప్రమోషన్ కోసం తరచూ వీడియోలు షేర్ చేస్తున్న సమంత తాజాగా విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది. ఈ స్పెషల్ వీడియోలో నథింగ్ టు హైడ్ అంటూ సమంత నవ్వించింది. ఇదొక మంచి ఉద్దేశంతో మొదలైంది అనే క్యాప్షన్ ను దానికి జత చేశారు, అయితే ఈ వీడియోలో సమంత మెడ వెనుక భాగంలో ఇన్నాళ్లుగా ఉన్న వైఎంసీ(ఏమాయా చేసావే) టాటూ కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయంశమైంది. సమంత తెలుగులో నటించిన తొలి తెలుగు సినిమా ఏం మాయ చేసావే హిట్ తో ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. గౌతమ్ వాసుదేవ్ మేనన్ దర్శకత్వం వహించిన ఈ ప్రేమ కథ చిత్రంలోని హీరో నాగచైతన్యతో మొదలైన సమంత ప్రేమాయణం కాస్తా వారి పెళ్లికి దారితీసి..అక్కినేని నాగార్జున ఇంటి కోడలుగా అడుగుపెట్టింది. ఇందుకు గుర్తుగా సమంత అప్పట్లో వైఎంసీ టాటూ వేయించుకున్నారు.

తాజా వీడియోలో సమంత మెడ భాగంలో వైఎంసీ టాటూ కనిపించకపోవడంతో ఆమె దానిని తొలగించారా? లేక మేకప్ తో కవర్ చేశారా అన్న చర్చ అభిమానుల్లో సాగుతుంది. 2021లో నాగచైతన్యతో సమంత విడాకుల అనంతరం ఆమె చైతన్యకు సంబంధించిన ఆనవాళ్లను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎంసీ టాటూ కూడా తొలగించారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సమంత యాక్షన్ ఎంటర్ టైనర్ రక్త్ బ్రహ్మండ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఆమె నిర్మాతగా రూపొందించిన తొలి ఫీచర్ ఫిల్మ్ శుభం విడుదలై విజయాన్ని సాధించింది. తన నిర్మాణ సంస్థ ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై కథానాయికగా మా ఇంటి బంగారం సినిమాలో సమంత నటిస్తున్నారు.