SS Rajamouli | మహేష్‌బాబు, రాజమౌళి.. గతంలోనే కలిసి పని చేశారనే విషయం తెలుసా?

SS Rajamouli | ఎంత గొప్ప స్థాయికి చేరుకున్న వ్యక్తి అయినా జీవితంలో తన మొదటి అడుగు వేసిన జ్ఞాపకాలు పదిలంగా దాచుకుంటాడు. అవి కష్టాలతో కూడుకున్నవైనా సరే.. ఇష్టంగా దాచుకుంటారు. ఇక సినిమా విషయానికి వస్తే ఎందరో గొప్పవారు చాలా కష్టాలకోర్చి, ఇబ్బందులు పడి మంచి స్థాయికి వచ్చిన వారున్నారు. ఇక గొప్ప దర్శకుడిగా, దర్శకధీరుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి విషయంలోనూ ఇలాంటి కథే ఉంది. రాజమౌళి తన కెరియర్‌లో ఎన్నో ఇబ్బందులు పడి ఇండస్ట్రీలో […]

  • Publish Date - July 24, 2023 / 10:27 AM IST

SS Rajamouli |

ఎంత గొప్ప స్థాయికి చేరుకున్న వ్యక్తి అయినా జీవితంలో తన మొదటి అడుగు వేసిన జ్ఞాపకాలు పదిలంగా దాచుకుంటాడు. అవి కష్టాలతో కూడుకున్నవైనా సరే.. ఇష్టంగా దాచుకుంటారు. ఇక సినిమా విషయానికి వస్తే ఎందరో గొప్పవారు చాలా కష్టాలకోర్చి, ఇబ్బందులు పడి మంచి స్థాయికి వచ్చిన వారున్నారు.

ఇక గొప్ప దర్శకుడిగా, దర్శకధీరుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి విషయంలోనూ ఇలాంటి కథే ఉంది. రాజమౌళి తన కెరియర్‌లో ఎన్నో ఇబ్బందులు పడి ఇండస్ట్రీలో తనకంటూ ఓ పేరు తెచ్చుకున్నాడు. అంతే కాకుండా తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా.. తను డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం అంతా చాటి చెప్పాడు.

అయితే రాజమౌళి కూడా కెరీర్ బిగినింగ్‌లో చాలా ఇబ్బందులే పడ్డాడు. తండ్రి విజయేంద్ర ప్రసాద్, అన్న కీరవాణి ఇద్దరూ గొప్ప స్థాయిలో ఉన్నా కూడా సొంత కష్టంతో, టాలెంట్‌తో పైకి రావాలని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. దర్శకత్వం మీద ఆసక్తితో చాలా కాలం రాఘవేంద్రరావు దగ్గరే పనిచేశాడు. శాంతి నివాసం సీరియల్‌కు అప్పట్లోనే డైరెక్టర్‌గా వర్క్ చేసాడు.

ఇకపోతే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన చాలా సినిమాలకు రాజమౌళి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడనే విషయం బయటికి రావడంతో.. ఆయన ఏయే సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాడా అని కొందరు ఆరా తీస్తున్నారు. అలా ఆయన చేసిన సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘రాజకుమారుడు’ మూవీ కూడా ఒకటి.

కమర్షియల్ హీరోగా టాలీవుడ్‌కి పరిచయం అవుతూ మహేష్ చేసిన మొదటి సినిమా ఇది. ‘రాజకుమారుడు’ కమర్షియల్‌గా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి ఆ రోజుల్లోనే రూ.9 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా రాజమౌళి వర్క్ చేశాడనే విషయం ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు. ఈ మధ్య రాఘవేంద్రరావు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రివీల్ చేశాడు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ యమా ఆనందంగా ఉన్నారు.

ఆరోజు మహేష్ మొదటి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన రాజమౌళి, ఇప్పుదదే మహేష్‌తో.. తన దర్శకత్వంలో సుమారు రూ. 1500 కోట్లతో త్వరలోనే సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు మహేష్ బాబు బర్త్ డే రోజున తెలుస్తాయని అంటున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్. అలాగే రాఘవేంద్రరావుకి కూడా వారు థ్యాంక్స్ చెబుతున్నారు. మరి మహేష్ కాకుండా.. ఇంకెంత మంది స్టార్ హీరోల సినిమాలకు రాజమౌళి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించారో..

Latest News