కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక.. తప్పుకున్న దిగ్విజయ్ సింగ్
విధాత, ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ నుంచి తప్పుకొంటున్నట్టుగా మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. మల్లికార్జున ఖర్గే ఈ పదవికి పోటీ చేయడానికి ముందుకు రావడంతో తాను ఈ రేసు నుంచి తప్పుకొంటున్నట్టుగా దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. తాను పోటీ చేయనని ఖర్గేకు స్ఫష్టం చేసినట్టుగా తెలిపారు. కాగా.. పార్టీలో ఖర్గే చాలా సీనియర్ నాయకుడని, ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఖర్గే పోటీ చేస్తున్నందున తాను ఆయనకు మద్దతిస్తున్నట్టుగా చెప్పారు. ఎఐసీసీ అధ్యక్ష పదవికి […]
విధాత, ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ నుంచి తప్పుకొంటున్నట్టుగా మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. మల్లికార్జున ఖర్గే ఈ పదవికి పోటీ చేయడానికి ముందుకు రావడంతో తాను ఈ రేసు నుంచి తప్పుకొంటున్నట్టుగా దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. తాను పోటీ చేయనని ఖర్గేకు స్ఫష్టం చేసినట్టుగా తెలిపారు.
కాగా.. పార్టీలో ఖర్గే చాలా సీనియర్ నాయకుడని, ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఖర్గే పోటీ చేస్తున్నందున తాను ఆయనకు మద్దతిస్తున్నట్టుగా చెప్పారు. ఎఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ నుంచి తప్పుకొంటున్నట్టు ఆయన తేల్చి చెప్పారు. పార్టీకి తాను విధేయుడినని దిగ్విజయ్ తెలిపారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి దిశా నిర్ధేశం చేయలేదని ఆ పార్టీ నేత ప్రమోద్ తివారీ చెప్పారు.
దిగ్విజయ్ పోటీ నుంచి తప్పుకోవడంతో శశి థరూర్‌తో పాటు మల్లిఖార్జున ఖర్గేలు బరిలో నిలవనున్నారు. శశిథరూర్ ఇవాళ దిగ్విజయ్‌తో భేటీ అయ్యారు.
అనంతరం ఆయన గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. ఇవ్వాళ చివరి రోజు కావడంతో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్టుగా ప్రకటించారు. మల్లికార్జున ఖర్గే కూడా ఇవాళ మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram