Digvijaya Singh | ద్విచ‌క్ర వాహ‌న‌దారుడిని ఢీకొట్టిన దిగ్విజ‌య్ సింగ్ కారు.. వీడియో

Digvijaya Singh | కాంగ్రెస్ పార్టీ( Congress Party ) సీనియ‌ర్ నేత‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్( Madhya Pradesh ) మాజీ ముఖ్య‌మంత్రి దిగ్విజ‌య్ సింగ్ కారు.. ఓ ద్విచ‌క్ర వాహ‌న‌దారుడిని అతి వేగంతో ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో యువ‌కుడి త‌ల‌కు గాయ‌మైంది. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రాజ్‌ఘ‌ర్‌లో నిన్న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. రాజ్‌ఘ‌ర్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్ర‌కాశ్ పురోహిత్ త‌ల్లి భౌతిక‌కాయానికి నివాళుల‌ర్పించిన దిగ్విజ‌య్ తిరిగి త‌న ఫార్చున‌ర్ […]

Digvijaya Singh | ద్విచ‌క్ర వాహ‌న‌దారుడిని ఢీకొట్టిన దిగ్విజ‌య్ సింగ్ కారు.. వీడియో

Digvijaya Singh | కాంగ్రెస్ పార్టీ( Congress Party ) సీనియ‌ర్ నేత‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్( Madhya Pradesh ) మాజీ ముఖ్య‌మంత్రి దిగ్విజ‌య్ సింగ్ కారు.. ఓ ద్విచ‌క్ర వాహ‌న‌దారుడిని అతి వేగంతో ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో యువ‌కుడి త‌ల‌కు గాయ‌మైంది. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రాజ్‌ఘ‌ర్‌లో నిన్న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. రాజ్‌ఘ‌ర్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్ర‌కాశ్ పురోహిత్ త‌ల్లి భౌతిక‌కాయానికి నివాళుల‌ర్పించిన దిగ్విజ‌య్ తిరిగి త‌న ఫార్చున‌ర్ టయోటా కారులో తిరిగి వ‌స్తున్నారు. జిరాపూర్ వ‌ద్ద‌ రాంగ్ రూట్‌లో వ‌చ్చిన ద్విచ‌క్ర వాహ‌న‌దారుడిని డిగ్గీ రాజా కారు ఢీకొట్టింది. దీంతో యువ‌కుడు బైక్‌పై నుంచి ఎగిరి కింద‌ప‌డ్డాడు. అత‌ని త‌ల‌కు గాయ‌మైంది. దీంతో దిగ్విజ‌య్ సింగ్ త‌న కారు దిగి యువ‌కుడిని స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్రాథ‌మిక చికిత్స అనంత‌రం భోపాల్‌కు త‌ర‌లించారు. రాంబాబు ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు.

గాయ‌ప‌డిన యువ‌కుడిని రాజ్‌పూర్‌లోని ప‌రోలియాకు చెందిన రాంబాబు బ‌గారి(20)గా పోలీసులు గుర్తించారు. ఇక స్థానిక పోలీసులు దిగ్విజ‌య్ సింగ్ కారును సీజ్ చేసి, డ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు.