Pelli Kani Prasad:దిల్ రాజు చేతికి.. స‌ప్తగిరి ‘పెళ్ళి కాని ప్రసాద్’

  • By: sr |    latest |    Published on : Mar 03, 2025 1:51 PM IST
Pelli Kani Prasad:దిల్ రాజు చేతికి..  స‌ప్తగిరి ‘పెళ్ళి కాని ప్రసాద్’

విధాత‌: క‌మెడియ‌న్ స‌ప్తగిరి (Sapthagiri) చాలాకాలం త‌ర్వాత హీరోగా న‌టిస్తున్న చిత్రం పెళ్లి కానీ ప్ర‌సాద్ (Pelli Kani Prasad). ప్రియాంకా శ‌ర్మ (Priyankasharma) హీరోయిన్‌గా న‌టిస్తోండ‌గా మ‌ర‌ళీధ‌ర్ గౌడ్‌, అన్న‌పూర్ణ‌, ప్ర‌మోదిని, వ‌డ్ల‌మాని శ్రీనావాస్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

పూర్తి వినోదాత్మ‌క చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి (Abhilash Reddy) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా భాను ప్ర‌కాశ్ గౌడ్, వేంక‌ట్లేశ్వ‌ర గౌడ్‌, బాబు నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఎస్పీసీ (SVC ) ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మార్చి 21న థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ మూవీ టీజ‌ర్ రిలీజ్ చేశారు.