NALGONDA: సాగర్ సందర్శించిన జిల్లా న్యాయమూర్తి
District Judge visiting Sagar విధాత: నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్(Nagarjun Sagar)ను మంగళవారం నల్గొండ జిల్లా న్యాయమూర్తి జగ్జీవన్ కుమార్(Justice Jagjeevan Kumar)కుటుంబ సమేతంగా సందర్శించారు. విజయ్ విహార్ అతిథి గృహానికి చేరుకున్న వీరికి నిడమనూరు కోర్టు న్యాయమూర్తి స్వప్న(Swapna), స్థానిక సీఐ నాగరాజు, ఎస్ ఐ రాంబాబు స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి కుటుంబం నాగార్జునకొండ మ్యూజియాన్ని, ప్రధాన డ్యామ్‌ను, ఎత్తిపోతల జలపాతాన్ని సందర్శించారు. ఆ తరువాత బుద్ధవనాన్ని(Bhuddavanam) సందర్శించి బుద్ధుని పాదాలకు పుష్పాంజలి ఘటించారు. […]
District Judge visiting Sagar
విధాత: నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్(Nagarjun Sagar)ను మంగళవారం నల్గొండ జిల్లా న్యాయమూర్తి జగ్జీవన్ కుమార్(Justice Jagjeevan Kumar)కుటుంబ సమేతంగా సందర్శించారు. విజయ్ విహార్ అతిథి గృహానికి చేరుకున్న వీరికి నిడమనూరు కోర్టు న్యాయమూర్తి స్వప్న(Swapna), స్థానిక సీఐ నాగరాజు, ఎస్ ఐ రాంబాబు స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి కుటుంబం నాగార్జునకొండ మ్యూజియాన్ని, ప్రధాన డ్యామ్‌ను, ఎత్తిపోతల జలపాతాన్ని సందర్శించారు.

ఆ తరువాత బుద్ధవనాన్ని(Bhuddavanam) సందర్శించి బుద్ధుని పాదాలకు పుష్పాంజలి ఘటించారు. బుద్ధ చరిత వనం, ధ్యానవనం, జాతకవనం, స్థూప వనం, మహాస్థూపాన్ని దాని అంతరభాగంలోని ధ్యాన మందిరాన్ని సందర్శించారు. వీరికి స్థానిక గైడు సత్యనారాయణ నాగార్జునకొండ, బుద్ధవనం చారిత్రక విశేషాలను వివరించారు. వీరితోపాటు కోర్టు సిబ్బంది అంజయ్య, లక్ష్మయ్య, అబ్దుల్ ఖాళీక్, శివ తదితరులు ఉన్నారు.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram