TItan | టైటాన్ ఎలా పేలిపోయిందో తెలుసా? ఈ వీడియో చూసేయండి
Titan టైటానిక్ దగ్గరకి పర్యాటకులతో బయలుదేరిన టైటాన్ అనే మినీ జలాంతర్గామి పేలిపోయిన విషయం తెలిసిందే. అందులో ఉన్న అయిదుగురు బిలియనీర్లు ప్రాణాలు కోల్పోవడంపై ప్రపంచం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ప్రమాదానికి గల కారణాలను సముద్ర శాస్త్రవేత్తలు, సముద్ర వ్యాపార వర్గాలు వివిధ రకాలుగా విశ్లేషించాయి. వీటన్నింటనీ క్రోడీకరించి సుమారు 6 నిమిషాల వీడియోను రూపొందించారు. ప్రమాద క్రమాన్ని కళ్లకు కడుతున్న ఈ వీడియోను 12 రోజుల్లోనే 60 లక్షల మంది వీక్షించారు. […]

Titan
టైటానిక్ దగ్గరకి పర్యాటకులతో బయలుదేరిన టైటాన్ అనే మినీ జలాంతర్గామి పేలిపోయిన విషయం తెలిసిందే. అందులో ఉన్న అయిదుగురు బిలియనీర్లు ప్రాణాలు కోల్పోవడంపై ప్రపంచం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
ఈ ప్రమాదానికి గల కారణాలను సముద్ర శాస్త్రవేత్తలు, సముద్ర వ్యాపార వర్గాలు వివిధ రకాలుగా విశ్లేషించాయి. వీటన్నింటనీ క్రోడీకరించి సుమారు 6 నిమిషాల వీడియోను రూపొందించారు. ప్రమాద క్రమాన్ని కళ్లకు కడుతున్న ఈ వీడియోను 12 రోజుల్లోనే 60 లక్షల మంది వీక్షించారు.
ఇదీ జరిగింది..
ఈ మినీ జలాంతర్గామి… తనను కంట్రోల్ చేసే నౌక నుంచి బయలుదేరిన రెండు గంటల్లోపే రాడార్ నుంచి అదృశ్యమైంది. సముద్రగర్భంలో ఉన్న అతి తీవ్రమైన ఒత్తిడి వల్లే టైటాన్ తునాతునకలై ఉంటుందని వీడియోలో చూపించారు. కేవలం మిల్లీ సెకన్‌లో వెయ్యో వంతులో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. టైటాన్ వెళ్లిన ప్రదేశంలో చ.కి.మీ.కు 5600 పౌండ్ల ప్రెజర్ ఉంటుంది.
ఇది భూ ఉపరితలంపై ఉండేదానికన్నా 400 రెట్లు ఎక్కువ కావడం విశేషం. మినీ సబ్‌మెరైన్ తట్టుకునే ఒత్తిడి కన్నా ఎక్కువ ఒత్తిడి పడిన మరుక్షణం.. అది పేలిపోయింది. ఈ వీడియోను చూసిన వాళ్లు పలు రకాలుగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
ప్రమాదం జరిగినపుడు అందులో ఉన్న వారంతా ఎలా ముక్కలు చెక్కలు అయిపోయారో ఈ వీడియో అద్భుతంగా చూపించింది. వారి బాధ ఈ వీడియో చూసిన వారికి అర్థమవుతుంది అని ఒక యూజర్ రాసుకొచ్చాడు.