Indian Railway | ఈ రైల్వే ప్లాట్‌ఫామ్‌ నిబంధనల గురించి మీకు తెలుసా..? లేకపోతే మీ జేబులకు చిల్లులే..!

Indian Railway | భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నది. దూర ప్రయాణాల కోసం భారతీయులు ఎక్కువగా రైల్వేనే ఆశ్రయిస్తుంటారు. ప్రయాణ ఖర్చు తక్కువ ఉండడంతో పాటు భద్రత సైతం ఉండడంతో ఎక్కువ రైల్వే ప్రయాణానికి మొగ్గు చూపుతుంటారు. అయితే, రైలు ప్రయాణం సమయంలో పలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అయితే, రైలులో ప్రయాణించే ప్రయాణికులైనా సరే కొన్ని సందర్భాల్లో ప్లాట్‌పై వేచి ఉండేందుకు సైతం టికెట్‌ను తీసుకోవాల్సిందే. లేకపోతే జరిమానా చెల్లించాల్సి […]

Indian Railway | ఈ రైల్వే ప్లాట్‌ఫామ్‌ నిబంధనల గురించి మీకు తెలుసా..? లేకపోతే మీ జేబులకు చిల్లులే..!

Indian Railway |

భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నది. దూర ప్రయాణాల కోసం భారతీయులు ఎక్కువగా రైల్వేనే ఆశ్రయిస్తుంటారు. ప్రయాణ ఖర్చు తక్కువ ఉండడంతో పాటు భద్రత సైతం ఉండడంతో ఎక్కువ రైల్వే ప్రయాణానికి మొగ్గు చూపుతుంటారు.

అయితే, రైలు ప్రయాణం సమయంలో పలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అయితే, రైలులో ప్రయాణించే ప్రయాణికులైనా సరే కొన్ని సందర్భాల్లో ప్లాట్‌పై వేచి ఉండేందుకు సైతం టికెట్‌ను తీసుకోవాల్సిందే. లేకపోతే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన గురించి చాలా మందికి తెలియకపోవచ్చు.. ఓ సారి తెలుసుకునే ప్రయత్నంచేద్దాం రండి..!

రైల్వే రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే..

ప్రయాణానికులు తమ రైలు ప్రయాణానికంటే ముందుగానే రైల్వేస్టేషన్‌కు చేరుకొని ప్లాట్‌ఫారామ్‌ చేరుకుంటుంటారు. అయితే, టికెట్‌ తీసుకున్న తర్వాత సైతం ప్లాట్‌ఫారమ్‌పై వెయింట్‌ చేసేందుకు సైతం సమయం ఉంటుంది. ఒక వేళ ఈ నిబంధనలు పాటించకపోతే జరిమానా సైతం చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.

ఏదైనా ప్రాంతానికి వెళ్లేందుకు రైలు టికెట్‌ను కొనుగోలు చేసిన సమయంలో ఆయా ప్లాట్‌ఫామ్స్‌పై వెయిట్‌ చేసేందుకు ప్రత్యేకంగా నియమాలను రైల్వేశాఖ రూపొందించింది. ఈ నియమాలు పగలు, రాత్రిళ్లు వేర్వేరుగా ఉంటాయి.

ప్రయాణికులు రైలులో ప్రయాణించే పగలు ప్రయాణిస్తే రెండుగంటల ముందు స్టేషన్‌కు చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. రైలు రాత్రి సమయంలో ఉంటే రైలు రావడానికి ఆరు గంటల ముందు స్టేషన్‌కు చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఎవరూ జరిమానా చెల్లించాల్సిన అవసరం ఉండదు.

రైలు దిగిన సమయంలోనూ ఇదే నిబంధన

ఈ నిబంధన రైలు ఎక్కే సమయంలోనే కాదు.. దిగే సమయంలోనే అమలవుతుంది. రైలు వచ్చిన తర్వాత గరిష్ఠంగా 2గంటల వరకు వేచి ఉండేందుకు అవకాశం ఉంటుంది. రాత్రి సమయంలో అయితే 6 గంటల వరకు ప్లాట్‌ఫామ్‌పై వెయిటింగ్‌కు అనుమతి ఉంటుంది.

టీటీఈలు టికెట్‌లు తనిఖీ చేసిన సమయంలో తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. నిర్ణీత సమయానికి మంచి రైల్వేస్టేషన్‌లో ఉండేందుకు ప్లాట్‌ఫారమ్‌ టికెట్‌ తీసుకోవాలి. లేకపోతే టీటీఈ జరిమానా విధించే అవకాశం ఉంటుంది.