Chiranjeevi | విధాత: చిరంజీవి నటించిన సినిమాలన్నింటిలోకి ‘ఇంద్ర’ మూవీకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ సినిమాకు బి.గోపాల్ దర్శకత్వం వహించాడు. సినిమా బ్లాక్ బాస్టర్‌గా నిలవాలంటే దానికి కావాల్సిన ఇంధనాలు సరిగ్గా సరి పోవాలి. అలా సంగీతం మణిశర్మ అందిస్తే, పరుచూరి బ్రదర్స్ సంభాషణలను, చిన్ని కృష్ణ కథను సమకూర్చారు. చిరూతో పాటు, సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ కథానాయకులుగా చేశారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో నడిచిన సినిమా ఇది. జూలై 24, 2002లో విడుదలై […]
Chiranjeevi |
విధాత: చిరంజీవి నటించిన సినిమాలన్నింటిలోకి ‘ఇంద్ర’ మూవీకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ సినిమాకు బి.గోపాల్ దర్శకత్వం వహించాడు. సినిమా బ్లాక్ బాస్టర్‌గా నిలవాలంటే దానికి కావాల్సిన ఇంధనాలు సరిగ్గా సరి పోవాలి. అలా సంగీతం మణిశర్మ అందిస్తే, పరుచూరి బ్రదర్స్ సంభాషణలను, చిన్ని కృష్ణ కథను సమకూర్చారు. చిరూతో పాటు, సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ కథానాయకులుగా చేశారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో నడిచిన సినిమా ఇది. జూలై 24, 2002లో విడుదలై ప్రభంజనమే సృష్టించింది.
అప్పట్లోనే 50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. నిజానికి అప్పటిరోజుల్లో టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ మూవీగా ‘ఇంద్ర’ విజయపథంలో నడిచింది. ఇప్పటికి సరిగ్గా 21 సంవత్సరాల క్రితం అన్నమాట. మన తెలుగు హీరోలు చేసిన సినిమాలకు అన్నిచోట్లా ఆదరణ బాగానే ఉంటుంది.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ఎక్కడా క్రేజ్ తగ్గలేదు ఇప్పటివరకూ.. ఇక ఇంద్ర సినిమా విషయానికి వస్తే, ‘ఇంద్ర’ సినిమా సృష్టించిన సునామీలో, మూస కొట్టుడు సినిమాలకు చెల్లు చీటి పడింది. ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచి, దూసుకుపోయింది. అంతేకాదు ఈ సినిమాకు చాలా రికార్డ్సే ఉన్నాయి. అవేమిటంటే..
ఇంద్రలో చిరు నటనకు ప్రాణం పోసినవి పరుచూరి బ్రదర్స్ మాటలనే చెప్పాలి. నాకు తగినట్టుగానే డైలాగ్స్ ఉండేలా చూడమని చిరంజీవి కోరడంతో పరుచూరి బ్రదర్స్ చిరు బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా డైలాగ్స్ రాశారు. అయితే ఆడియో ఫంక్షన్లో అభిమానులు గురూ డైలాగ్.. గురూ డైలాగ్ అని అరవడంతో సినిమాలోకి కొత్తగా వచ్చి చేరిన డైలాగ్స్ చాలానే ఉన్నాయి.
ముఖ్యంగా ‘మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’ అనే డైలాగ్ ఆ తర్వాత కలిపిందే. ‘తప్పు నా వైపు ఉంది కాబట్టి తలవంచుకుని వెళ్తున్నా, లేకపోతే తలలు తీసుకెళ్ళేవాడిని’ అనే డైలాగ్ ఇప్పటికీ పాపులర్ డైలాగే.. అలాగే షూటింగ్ సమయంలోనే కొన్ని డైలాగ్స్ రాసి ఆశ్చర్య పరిచారు పరుచూరి బ్రదర్స్.
అప్పటి కప్పుడు కథకు తగినట్టుగా మంచి గ్రేస్ ఉన్న డైలాగ్స్ రాసి చిరంజీవిని మెప్పించి మరీ సోనీ ఎరికసన్ ఫోన్ కానుకగా తీసుకున్నారు పరుచూరి బ్రదర్స్. అందులో ముఖ్యంగా చెప్పాలంటే ‘రాననుకున్నారా, రాలేననుకున్నారా’ అనే డైలాగ్ అప్పటికప్పుడు పుట్టిందే..
ఇలా చెప్పుకుంటూ పోతే ‘ఇంద్ర’ ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమా ధాటికి సౌత్ ఇండస్ట్రీలో మరో మూడేళ్ళ వరకు ఈ సినిమా రికార్డ్స్‌ని మరో సినిమా బ్రేక్ చేయలేకపోయింది. రజనీకాంత్ ‘చంద్రముఖి’ 2005లో వచ్చి అప్పుడు బ్రేక్ చేసింది. దీని తర్వాత దాదాపు నాలుగేళ్ళకు ‘పోకిరి’ సినిమా రికార్డ్ కొట్టింది.
అయితే ఇంద్ర మూవీని ‘ఇంద్ర ది టైగర్’ పేరుతో డబ్ చేసి బాలీవుడ్లో టెలివిజన్ ద్వారా రిలీజ్ చేశారు. ఈ మూవీ అక్కడా దూసుకుపోయింది. అదే టైంలో హిందీ ఆడియన్స్ దీనికి బాగా కనెక్ట్ అయ్యారు. సినిమా రైట్స్ కొన్న ఛానల్స్ అయితే మరో అడుగు ముందుకు వేసి సినిమాకు రేటింగ్ బావుందని రెండు వారాలకోకసారి సినిమా వేసి ఛానల్ రేటింగ్ పెంచుకునేవారట.
దీని మీద నేషనల్ మీడియాలో స్పెషల్ ఆర్టికల్ కూడా రావడం కూడా విశేషం. ఈ హిందీ ‘ఇంద్ర ది టైగర్’ టెలివిజన్ రంగంలోనే చెరగని ముద్ర వేసుకుంది. ఇలా ‘ఇంద్ర’ సినిమా మెగా ఫ్యాన్స్‌కి ఎప్పుడూ ప్రత్యేకమే. నెక్ట్స్ రాబోయే మెగాస్టార్ బర్త్‌డేకి ఈ సినిమాని రీ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.