Magic: డోంట్ నో వై.. గౌత‌మ్ తిన్న‌నూరి ‘మ్యాజిక్’ నుంచి సెన్సిబుల్ మెలోడి! అనిరుధ్ హ్యాట్సాఫ్‌

  • By: sr |    latest |    Published on : Feb 14, 2025 11:04 PM IST
Magic: డోంట్ నో వై.. గౌత‌మ్ తిన్న‌నూరి ‘మ్యాజిక్’ నుంచి సెన్సిబుల్ మెలోడి! అనిరుధ్ హ్యాట్సాఫ్‌

మ‌ళ్లీరావా, జ‌ర్సీ వంటి సెన్సిబుల్ చిత్రాల‌తో త‌న‌కంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న గౌత‌మ్ తిన్న‌నూరి (Gowtam Tinnanuri) కొత్త‌గా రూపొందిస్తున్న చిత్రం మ్యాజిక్ (Magic). సితార ఎంట‌ర్టైన్ మెంట్స్ (Sithara Entertainments) ఈ సినిమాను నిర్మిస్తోండ‌గా అనిరుద్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు.

విక్ర‌మ్ నాన్న ఫేమ్ సారా అర్జున్ (Sara Arjun) క‌థానాయిక‌గా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తుండ‌గా అన్మోల్‌, అకాష్‌,సిద్ధార్థ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి డోంట్ నో వై అంటూ సాగే మెలోడీని విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా అనిరుధ్ బ్యాండ్ తో పాటు సినిమాలోని కొన్ని పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేశారు.