King Cobra | మద్యం మత్తులో నాగుపాముకు ముద్దు.. చిందులేస్తుండగా కాటేసింది..
King Cobra | ఓ యువకుడు పీకల దాకా మద్యం సేవించాడు. మద్యం మత్తులో ఉన్న అతను అక్కడే ప్రత్యక్షమైన ఓ నాగుపాముకు ముద్దు పెట్టాడు. దాన్ని మెడలో వేసుకుని చిందులేస్తుండగా అది కాటేసింది. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బీహార్ (Bihar)లోని నవాదా జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. నవాదా జిల్లాలోని గోవింద్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని దిలీప్ యాదవ్ అనే వ్యక్తి నిన్న మద్యంలో మునిగి తేలాడు. పీకల దాకా […]

King Cobra | ఓ యువకుడు పీకల దాకా మద్యం సేవించాడు. మద్యం మత్తులో ఉన్న అతను అక్కడే ప్రత్యక్షమైన ఓ నాగుపాముకు ముద్దు పెట్టాడు. దాన్ని మెడలో వేసుకుని చిందులేస్తుండగా అది కాటేసింది. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బీహార్ (Bihar)లోని నవాదా జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. నవాదా జిల్లాలోని గోవింద్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని దిలీప్ యాదవ్ అనే వ్యక్తి నిన్న మద్యంలో మునిగి తేలాడు. పీకల దాకా మద్యం సేవించి.. తనకు కనిపించిన నాగుపాము( King Cobra )ను పట్టుకుని, ముద్దు పెట్టాడు. ఆ తర్వాత కింగ్ కోబ్రాను మెడలో వేసుకుని కాసేపు చిందులేశాడు.
ఆలయం వద్దకు చేరుకుని తనను క్షమించమని కోరాడు. కాసేపటికే ఆ పాము అతన్ని కాటేయడంతో కింద పడిపోయాడు. అప్రమత్తమైన స్థానికులు అతన్ని సమీప ఆస్పత్రికి తరలించగా, మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.