రాష్ట్రపతి.. ప్రధాని హైదరాబాద్‌లో ఉండగానే..
తెలంగాణ రాజకీయాల్లో బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు వ్యవహారం కీలక పరిణామంగా నిలిచింది
- కవితను అరెస్టు చేసిన ఈడీ
విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు వ్యవహారం కీలక పరిణామంగా నిలిచింది. ఒకవైపు దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలు హైదరాబాద్‌లో ఉండగానే ఇంకోవైపు కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది. కవిత అరెస్టు సమయంలో మల్కాజిగిరిలో ప్రధాని మోదీ రోడ్ షో కొనసాగుతుండగా, ఇదే సమయంలో మరోవైపు నగర శివారులోని కన్హ శాంతి వనంలో నిర్వహిస్తున్న ‘ప్రపంచ ఆథ్యాత్మిక మహోత్సవ్- 2024లో రాష్ట్రపతి హాజరవ్వడం గమనార్హం. అటు కవిత అరెస్టును నిరసిస్తూ ఆమె నివాసం వద్ధకు చేరుకున్న బీఆరెస్ శ్రేణులు బీజేపీకి, నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram