HCA ED CASE:హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిధుల దుర్వినియోగం కేసులో ఈడీ దూకుడు!

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) నిధుల దుర్వినియోగం కేసులో హెచ్ సీఏ మాజీ కోశాధికారిగా ఉన్న వ్యాపారి సురేందర్ అగర్వాల్ కు చెందిన రూ.51.29 లక్షల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 నిబంధనల ప్రకారం ఆస్తులను సీజ్ చేసింది.

HCA ED CASE:హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిధుల దుర్వినియోగం కేసులో ఈడీ దూకుడు!

HCA ED CASE:హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) నిధుల దుర్వినియోగం కేసుకు సంబంధించి ఈడీ దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్ సీఏ మాజీ కోశాధికారిగా ఉన్న వ్యాపారి సురేందర్ అగర్వాల్ కు చెందిన రూ.51.29 లక్షల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 నిబంధనల ప్రకారం ఆస్తులను సీజ్ చేసింది.

క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్, వ్యాయామ పరికరాల పేరుతో హెచ్ సీఏ సబ్ కాంట్రాక్టులలో సురేందర్ అగర్వాల్ కు క్విడ్ ప్రో కో కింద మూడు కంపెనీలు రూ.90 లక్షలు చెల్లించినట్లుగా గుర్తించింది. సురేందర్, అతని కుటుంబసభ్యుల ఖాతాలకు రూ.90 లక్షలకు పైగా నగదు బదిలీ జరిగినట్లుగా ఈడీ విచారణలో తేలింది. దీంతో ఈ కేసులో మరిన్ని అక్రమాల నిగ్గు తేల్చేందుకు ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది.

హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి మంజూరైన నిధులను దుర్వినియోగం చేయడంతో పాటు క్రికెట్ బాల్‌లు, జిమ్ పరికరాలు, బకెట్ కుర్చీల కొనుగోలులో నిధుల దుర్వినియోగంపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్‌లపై నమోదు చేసిన అనేక ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగిస్తుంది.