ED RIDES | కామినేని, ప్ర‌తిమ, మెడిసిటీ, ఎస్వీఎస్ మెడికల్‌ కాలేజీల్లో ఈడీ సోదాలు

ED RIDES | విధాత : హైదరాబాద్‌లో మరోసారి ఈడీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. ఇటీవలే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైళ్ల శేఖ‌ర్‌రెడ్డి, మ‌ర్రి జ‌నార్ద‌న్‌రెడ్డి, కొత్త ప్ర‌భాక‌ర్‌రెడ్డిలకు సంబంధించిన వ్యాపారాలు, కార్యాల‌యాల‌పై సోదాలు నిర్వ‌హించిన ఈడీ.. కామినేని ఆస్ప‌త్రి, ఎస్వీఎస్‌తో స‌హా ఆరు మెడిక‌ల్ క‌ళాశాల‌ల‌పై సోదాలు చేస్తోంది. బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం నుంచి 11 బృందాలుగా విడిపోయి ఈ సోదాలు జ‌రుపుతున్నారు. భారీగా సీఆర్పీఎఫ్ బలగాలతో ఈడీ బృందాలు బయలుదేరాయి. హైదరాబాద్‌తో పాటు నల్గొండ, […]

ED RIDES | కామినేని, ప్ర‌తిమ, మెడిసిటీ, ఎస్వీఎస్ మెడికల్‌ కాలేజీల్లో ఈడీ సోదాలు

ED RIDES |

విధాత : హైదరాబాద్‌లో మరోసారి ఈడీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. ఇటీవలే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైళ్ల శేఖ‌ర్‌రెడ్డి, మ‌ర్రి జ‌నార్ద‌న్‌రెడ్డి, కొత్త ప్ర‌భాక‌ర్‌రెడ్డిలకు సంబంధించిన వ్యాపారాలు, కార్యాల‌యాల‌పై సోదాలు నిర్వ‌హించిన ఈడీ.. కామినేని ఆస్ప‌త్రి, ఎస్వీఎస్‌తో స‌హా ఆరు మెడిక‌ల్ క‌ళాశాల‌ల‌పై సోదాలు చేస్తోంది.

బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం నుంచి 11 బృందాలుగా విడిపోయి ఈ సోదాలు జ‌రుపుతున్నారు. భారీగా సీఆర్పీఎఫ్ బలగాలతో ఈడీ బృందాలు బయలుదేరాయి. హైదరాబాద్‌తో పాటు నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌న‌గర్, మేడ్చల్, ఖమ్మం జిల్లాలో ఈడీ రైడ్స్ జరిగే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది.

కామినేని ఆస్ప‌త్రితోపాటు, కామినేని గ్రూప్ చైర్మన్, ఎండీ నివాసాలపై సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణలో మొత్తంగా 15 చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్‌లో సైతం సోదాలు జరుగుతున్నాయి.

అలాగే మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కళాశాలలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. షామీర్‌పేటలోని మెడిసిటీ కళాశాలలో ఏరియా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఫిల్మ్ నగర్‌లోని ప్రతిమా కార్పొరేట్ కార్యాలయంపై సోదాలు నిర్వహిస్తోంది. ప్రతిమా గ్రూప్‌కి చెందిన ఆర్ధిక లావాదేవీలపై ప్రశ్నిస్తున్నారు.