Site icon vidhaatha

IPL-2025 Postponed: భారత్ పాక్ ఉద్రిక్తతల ఎఫెక్ట్..ఐపీఎల్-2025వాయిదా!

IPL-2025 Postponed:: ఐపీఎల్-2025 టోర్ని వాయిదా వేస్తూ బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్-పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్-2025ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లుగా బీసీసీఐ ప్రకటించింది.ప్లేయర్ల భద్రతకు ప్రాధాన్యమిస్తూ బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది. విదేశీ ఆటగాళ్లను వారివారి దేశాలకు సురక్షితంగా పంపిస్తున్నామని తెలిపింది. ఐపీఎల్ నిరవధిక వాయిదా నిర్ణయంలో లీగ్ దశలో మిగిలి ఉన్న 12మ్యాచ్ ల నిర్వహణ వాయిదా పడింది. షెడ్యూల్ మేరకు ఐపీఎల్ టోర్నిలో మే 25న కోల్ కతాలో ఫైనల్ మ్యాచ్ జరుగాల్సి ఉంది.

క్రికెట్ అభిామానులను ఎంతగానో అలరిస్తున్న ఐపీఎల్ వాయిదా పడినప్పటికి దేశం కంటే మరేది ముఖ్యం కాదంటున్నారు అభిమానులు. అయితే పహల్గాం ఉగ్రదాడి…ప్రతికారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ తో పాక్ పై దాడులు..పాక్ ప్రతిదాడులతో రెండు దేశాల మధ్య యుద్ద పరిస్థితులు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఐపీఎల్ వాయిదాకు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

Exit mobile version