Fish Curry | చేపల కూర తిని భార్య మృతి.. కోమాలో భర్త.. ఆ ఫిష్ ప్రాణాంతకమా..?
Fish Curry | మలేషియాలో విరివిగా దొరికే పఫర్ చేపల( Puffer Fish ) కూరను ఇంట్లోనే ఓ వృద్ధ దంపతులు ప్రిపేర్ చేసుకున్నారు. అయితే చేపల కూర తిన్న తర్వాత భార్య మృతి చెందగా, భర్త కోమాలోకి వెళ్లిపోయాడు. భర్త పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఈ ఘటనపై ఆ వృద్ధ దంపతుల కూతురు మాట్లాడుతూ.. మా అమ్మనాన్న స్థానికంగా ఉన్న మార్కెట్‌లోనే ఎన్నో ఏండ్ల నుంచి చేపలు తెచ్చుకుంటున్నారు. రెగ్యులర్‌గా అదే మార్కెట్‌కు వెళ్తారు […]
Fish Curry | మలేషియాలో విరివిగా దొరికే పఫర్ చేపల( Puffer Fish ) కూరను ఇంట్లోనే ఓ వృద్ధ దంపతులు ప్రిపేర్ చేసుకున్నారు. అయితే చేపల కూర తిన్న తర్వాత భార్య మృతి చెందగా, భర్త కోమాలోకి వెళ్లిపోయాడు. భర్త పరిస్థితి కూడా విషమంగా ఉంది.
ఈ ఘటనపై ఆ వృద్ధ దంపతుల కూతురు మాట్లాడుతూ.. మా అమ్మనాన్న స్థానికంగా ఉన్న మార్కెట్‌లోనే ఎన్నో ఏండ్ల నుంచి చేపలు తెచ్చుకుంటున్నారు. రెగ్యులర్‌గా అదే మార్కెట్‌కు వెళ్తారు కాబట్టి.. నమ్మకంతో పఫర్ చేపలు తెచ్చుకున్నారు. లంచ్ కోసం చేపల కర్రీ( Fish Curry ) ప్రిపేర్ చేసుకున్నారు. ఇక చేపల కూర తిన్న వెంటనే మా అమ్మ లిమ్ గౌన్ శరీరం వణికిపోయింది. శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. కాసేపటికే ఆమె మృతి చెందింది. మరో గంట తర్వాత అవే లక్షణాలు మా తండ్రిలో కూడా కనిపించాయి. దీంతో మేం అతన్ని ఆస్పత్రికి తరలించాం. ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉందని కూతురు తెలిపింది.
పఫర్ చేప తింటే చనిపోతారా..?
అయితే ఆ వృద్ధ దంపతులు పఫర్ చేప( Puffer Fish ) తిన్నారని తెలియడంతో.. ఆ రోజు విక్రయించిన చేపలను పరీక్షల నిమిత్తం ఆరోగ్య శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే స్థానికంగా ఎంతో డిమాండ్ ఉన్న పఫర్ చేపల్లో ప్రాణాంతకమైన టాక్సిన్స్ ఉంటాయని ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ చేపల్లో ఉండే టెట్రోడోటాక్సిన్( tetrodotoxin ), సాక్సిటాక్సిన్( saxitoxin ) వంటి టాక్సిన్స్‌ను కుకింగ్ ద్వారా కూడా నాశనం చేయలేము అని తెలిపారు. ఆ విషపదార్థాలను ఎలా తొలగించాలో శిక్షణ పొందిన క్వాలిఫైడ్ చెఫ్స్‌కు మాత్రమే ఆ చేపలను వండుతారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram