Cyber Fraud | కరెంటు బిల్లు కట్టలేదు కనెక్షన్‌ కట్‌ చేస్తామని ఫోన్‌.. తీరా లింక్‌ ఓపెన్‌ చేస్తే ఖాతా నుంచి డబ్బులు కట్‌..!

Cyber Fraud | సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఎంతో సైబర్‌ నేరగాళ్ల బారినపడ్డారు. తాజా కరెంటు బిల్లు కట్టలేదని మెస్సేజ్‌ పంపి.. ఖాతా నుంచి సొత్తంతా ఊడ్చేశారు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి మండలం దేవునిపల్లికి చెందిన రాజేశ్వర్‌కు ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ వచ్చింది. మూడు నెలల కరెంటు బిల్లు పెండింగ్‌ ఉందని, వెంటనే బిల్లు చెల్లించకపోతే కరెంటు సరఫరాను బంద్‌ చేస్తామని హెచ్చరించాడు. మళ్లీ […]

  • By: krs    latest    Feb 23, 2023 7:29 AM IST
Cyber Fraud | కరెంటు బిల్లు కట్టలేదు కనెక్షన్‌ కట్‌ చేస్తామని ఫోన్‌.. తీరా లింక్‌ ఓపెన్‌ చేస్తే ఖాతా నుంచి డబ్బులు కట్‌..!

Cyber Fraud | సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఎంతో సైబర్‌ నేరగాళ్ల బారినపడ్డారు. తాజా కరెంటు బిల్లు కట్టలేదని మెస్సేజ్‌ పంపి.. ఖాతా నుంచి సొత్తంతా ఊడ్చేశారు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి మండలం దేవునిపల్లికి చెందిన రాజేశ్వర్‌కు ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ వచ్చింది.

మూడు నెలల కరెంటు బిల్లు పెండింగ్‌ ఉందని, వెంటనే బిల్లు చెల్లించకపోతే కరెంటు సరఫరాను బంద్‌ చేస్తామని హెచ్చరించాడు. మళ్లీ విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించాలంటే ఆఫీసుల చుట్టూ తిరిగాల్సి వస్తుందని, కనెక్షన్‌ కట్‌ చేస్తే మళ్లీ కొత్త దాని కోసమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పాడు.

దీంతో ఆందోళనకు గురైన రాజేశ్వర్‌ కరెంటు కనెక్షన్‌ను బంద్‌ చేయొద్దని, బిల్లు కడుతానని చెప్పగా.. ఓ లింక్‌ పంపిస్తానని.. అందులో నుంచి పెండింగ్‌ బిల్లు వెంటనే చెల్లించాలని చెప్పాడు. సదరు వ్యక్తి చెప్పినట్లుగానే రాజేశ్వర్‌ ఫోన్‌కు మెస్సేజ్‌ వచ్చింది.

దాన్ని ఓపెన్‌ చేయగా.. ఖాతాలో నుంచి రూ.49వేలు డెబిట్‌ అయినట్లు మెస్సేజ్‌ వచ్చింది. దాంతో తాను మోసపోయానని గుర్తించిన రాజేశ్వర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల కరెంటు బిల్లు పేరుతో మోసాలు జరుగుతుండగా.. కరెంటు బిల్లు కట్టాలని సిబ్బంది ఫోన్‌ చేయరని స్పష్టం చేశారు. ఇంటికే వచ్చి అడుగుతారని, లేదంటే స్థానిక లైన్‌మెన్‌ వచ్చి విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తారని, పెండింగ్‌ బిల్లు కట్టిన తర్వాత సరఫరా పునరుద్ధరిస్తారని స్పష్టం చేశారు.

విద్యుత్‌ బిల్లులు కట్టాలని ఫోన్‌ వస్తే ఎవరూ నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు. అయినా, ఎక్కడ ఎవరో ఒకరు సైబర్‌ నేరగాళ్ల బారిన పడుతూనే ఉన్నారు. పోలీస్‌ అధికారులు సైబర్‌ నేరగాళ్లకు అడ్డుకట్ట వేయాలని జనం కోరుతున్నారు.