Viral Video | హైవేపై టోల్ ట్యాక్స్ కలెక్టర్‌గా అవతారమెత్తిన ఏనుగు..
Viral Video | ప్రధాన రహదారిపై ఏనుగు( Elephant ) టోల్ ట్యాక్స్ కలెక్టర్( Toll Tax Collector )గా అవతారమెత్తడం ఏంటని అనుకుంటున్నారా..? టోల్ ట్యాక్స్ మనషులు వసూలు చేస్తారు కదా..? మరి ఏనుగు చేయడం ఏంటని భావిస్తున్నారా..? మీ ప్రశ్నే సరైనదే.. కానీ ఆ ఏనుగు ఏదో డబ్బులు వసూలు చేయలేదు. తన ఆకలి తీర్చుకునేందుకు ఆ రహదారి గుండా వెళ్తున్న చెరుకు( Sugarcane ) లోడ్ వాహనాలను ఆపుతుంది. కొన్ని చెరుకు గడలను […]

Viral Video | ప్రధాన రహదారిపై ఏనుగు( Elephant ) టోల్ ట్యాక్స్ కలెక్టర్( Toll Tax Collector )గా అవతారమెత్తడం ఏంటని అనుకుంటున్నారా..? టోల్ ట్యాక్స్ మనషులు వసూలు చేస్తారు కదా..? మరి ఏనుగు చేయడం ఏంటని భావిస్తున్నారా..? మీ ప్రశ్నే సరైనదే..
కానీ ఆ ఏనుగు ఏదో డబ్బులు వసూలు చేయలేదు. తన ఆకలి తీర్చుకునేందుకు ఆ రహదారి గుండా వెళ్తున్న చెరుకు( Sugarcane ) లోడ్ వాహనాలను ఆపుతుంది. కొన్ని చెరుకు గడలను తీసుకున్న తర్వాత ఆ వాహనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది ఏనుగు.
ఈ వీడియోను చిత్రీకరించిన ఓ యూజర్ సరదాగా.. ది టోల్ ట్యాక్స్ కలెక్టర్ అని క్యాప్షన్ ఇచ్చాడు.
దట్టమైన అడవిలో ఉన్న ఆ రహదారి గుండా వాహనాలు వేగంగా కదులుతున్నాయి. ఓ ఏనుగు కూడా రోడ్డుపైకి వచ్చింది. అయితే రహదారిపై వెళ్తున్న వాహనాలకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు ఏనుగు. కేవలం చెరుకు లోడ్‌తో వెళ్తున్న లారీలను మాత్రమే ఆ ఏనుగు ఆపుతోంది.
మరి అత్యాశకు పోకుండా.. ఓ ఆరేడు చెరుకు గడలను మాత్రమే తీసుకొని, ఆ వాహనాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇలా ఒక నిమిషం 42 సెకన్ల నిడివి గల వీడియోలో ఆ ఏనుగు మూడు చెరుకు వాహనాలను ఆపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. 2 లక్షల 30 వేల మంది ఈ వీడియోను వీక్షించగా, 1000 మంది రీట్వీట్లు చేశారు. 6 వేల మంది లైక్ చేశారు.